షాకింగ్: చెప్పులు వేసుకుని బైక్ నడిపితే.. జైలే గతి!

షాకింగ్: చెప్పులు వేసుకుని బైక్ నడిపితే.. జైలే గతి!

కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి వాహనదారులకు కంటి మీద కునుకు ఉండట్లేదు. రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. చట్టంలో ఉన్న లూప్ హోల్స్ వెతికి మరీ ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. ‘భరత్ అనే నేను’ సినిమాలో ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు వెయ్యాలని హీరో మహేష్ బాబు అధికారులతో చర్చించడం చూసి మనం ఆశ్చర్యపోయాం. సరిగ్గా ఇప్పుడు అవే ఫైన్‌లను వాస్తవంలో అమలు చేసేసరికి వెన్నులో వణుకు […]

Ravi Kiran

|

Sep 10, 2019 | 8:19 AM

కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి వాహనదారులకు కంటి మీద కునుకు ఉండట్లేదు. రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. చట్టంలో ఉన్న లూప్ హోల్స్ వెతికి మరీ ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. ‘భరత్ అనే నేను’ సినిమాలో ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు వెయ్యాలని హీరో మహేష్ బాబు అధికారులతో చర్చించడం చూసి మనం ఆశ్చర్యపోయాం. సరిగ్గా ఇప్పుడు అవే ఫైన్‌లను వాస్తవంలో అమలు చేసేసరికి వెన్నులో వణుకు పుడుతోంది.

ఇది ఇలా ఉండగా ప్రచారంలోకి వచ్చిన మరో కొత్త రూల్.. వాహనదారులను మరింతగా భయపెడుతోంది. టూ- వీలర్స్ నడిపేటప్పుడు వాహనదారులు స్లిపర్స్ వంటివి వాడకూడదని.. ఒకవేళ నిర్లక్ష్యం చేసి ఈ రూల్‌ను అతిక్రమిస్తే.. వెయ్యి రూపాయల జరిమానా కట్టాల్సిందేనని సమాచారం. చిన్న మొత్తమే కదా ఏమవుతుందని అనుకున్నారా అంటే సంగతులు. మొదటిసారి చెప్పులు లేదా శాండిల్స్ ధరించి డ్రైవింగ్ చేస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. అదే రెండోసారి కూడా చెప్పులు వేసుకుని నడిపితే 15 రోజుల పాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రూల్ ఇప్పటికే ఉన్నా కొన్ని ప్రదేశాల్లో ఇంకా అమలు చేయలేదని.. రూల్స్ కఠినతరం చేయాల్సి వస్తే అధికారులు తప్పకుండా అమలు చేస్తారని తెలుస్తోంది. మరోవైపు యూపీలో మరో కొత్త రూల్ ను అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. లారీ డ్రైవర్లు లుంగీలు ధరించి డ్రైవింగ్ చేస్తే రూ. 2000 జరిమానా విధించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. నిజానికి ఈ రూల్ ఇప్పటిది కాదు.. 1989 నాటి మోటారు వాహనాల చట్టం లోనిది. లారీలు మాత్రమే కాకుండా బస్సులు, వ్యాన్లు, ఇతర పెద్ద వాహనాలను నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా ఫుల్ సైజు ప్యాంటు, షర్టు ధరించి, షూ కూడా వేసుకోవాలని ఆ చట్టంలో పొందుపరిచారు. ఒకవేళ దీన్ని ఉల్లంఘించి నడిపితే పాత చట్టం ప్రకారం రూ. 500 జరిమానా పడుతుంది. అయితే కొత్తగా వచ్చిన చట్టం పాత రూల్స్ అన్నింటిని సవరించి భారీగా ఫైన్‌లను పెంచేయడంతో అది కాస్తా రూ. 2000లకు పెరిగింది. అంతేకాకుండా ఈ రూల్‌ని వాహనదారుల భద్రత కొరకే చట్టంలో పొందుపరిచారని అధికారులు అంటున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu