ఇండియా ‘రేపిస్తాన్’ అట.. కొత్త అర్ధమిచ్చిన అర్బన్ డిక్షనరీ!

మనలో చాలామంది అర్బన్ డిక్షనరీని చాలాసార్లు ఉపయోగించి ఉంటాం. కొత్త కొత్త పదాలకు కేర్ అఫ్ అడ్రెస్ అయిన ఈ నిఘంటువులో ప్రజలు సెటైర్లు వేసేటప్పుడు, వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడు వాడే కొత్తరకం పదాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాయి. అందువల్ల ఈ డిక్షనరీ యువతకు బాగా నచ్చుతుంది. అయితే ఇది నిజానికి కరెక్ట్ డిక్షనరీ కాదు. జస్ట్ డిక్షనరీ డాట్ కామ్‌కి స్పూఫ్ లాంటిది. ఇప్పటికే పలు రకాలుగా వివాదాస్పదమైన ఈ అర్బన్ డిక్షనరీ.. తాజాగా మరో వివాదానికి […]

ఇండియా 'రేపిస్తాన్' అట.. కొత్త అర్ధమిచ్చిన అర్బన్ డిక్షనరీ!
Follow us

|

Updated on: Sep 10, 2019 | 12:17 PM

మనలో చాలామంది అర్బన్ డిక్షనరీని చాలాసార్లు ఉపయోగించి ఉంటాం. కొత్త కొత్త పదాలకు కేర్ అఫ్ అడ్రెస్ అయిన ఈ నిఘంటువులో ప్రజలు సెటైర్లు వేసేటప్పుడు, వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడు వాడే కొత్తరకం పదాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాయి. అందువల్ల ఈ డిక్షనరీ యువతకు బాగా నచ్చుతుంది. అయితే ఇది నిజానికి కరెక్ట్ డిక్షనరీ కాదు. జస్ట్ డిక్షనరీ డాట్ కామ్‌కి స్పూఫ్ లాంటిది. ఇప్పటికే పలు రకాలుగా వివాదాస్పదమైన ఈ అర్బన్ డిక్షనరీ.. తాజాగా మరో వివాదానికి తెర లేపింది. ఇండియా అంటే ‘రేపిస్తాన్’ అని అభివర్ణించింది. దీనిపై ఇండియన్స్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అవుతున్నారు.

నిదా మాలిక్ అనే ట్విట్టర్ యూజర్… రేపిస్థాన్ అంటే ఏంటని అడిగారు. దీనిపై స్పందించిన అర్బన్ డిక్షనరీ… రేపిస్థాన్ అంటే… హిందుస్థాన్ లేదా ఇండియా అని చెప్పింది. ఇండియాలో ఏడాది వయసున్న బాలికల్ని కూడా రేప్ చేస్తారని తెలిపింది. ఇండియాలో మహిళల కంటే… ఆవులకే ఎక్కువ రక్షణ, గౌరవం ఉంటుందని అభివర్ణించింది. దీని గురించి చెబుతూ నిదా మాలిక్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇది ఇలా ఉండగా అర్బన్ డిక్షనరీ అనేది క్రౌడ్ సోర్స్ వెబ్‌సైట్… అంటే… ఏ యూజరైనా… ఏ పదానికైనా నిర్వచనం చెప్పవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో ఏ పదం గురించైనా మనం చాలా వేగంగా సమాధానం పొందగలం. దానిపై యూజర్లు తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. ఆ పదాలకు డిస్క్రిప్షన్ ఇవ్వవచ్చు. సరిగ్గా ఇండియా నిర్వచనంలో కూడా అదే జరిగింది. ఛాన్స్ దొరికితే చాలు చాలామంది యూజర్లు ఇష్టమొచ్చినట్లుగా నిర్వచనాలు ఇస్తుంటారు. ఇకపోతే కొందరు నెటిజన్లు మాత్రం పాకిస్థానీలు కావాలనే భారతదేశం గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. కాగా అర్బన్ డిక్షనరీ.. మూడు రోజుల తర్వాత ఆ నిర్వచనాన్ని డిలీట్ చేయడం జరిగింది.