Varanasi: వారణాసిలో ముగిసిన హాట్‌బెలూన్, బోట్ ఫెస్టివల్.. ఓకే ట్రిప్‌లో వినోదం, ఆధ్యాత్మక భావన పొందిన సందర్శకులు
జనవరి 17 నుండి జనవరి 20 మధ్య కాశీలో అంతర్జాతీయ బెలూన్ , బోట్ ఫెస్టివల్ ఉత్సవాలను రాష్ట్ర పర్యాటక శాఖ అత్యంత ఘనంగా నిర్వహించింది. వారణాసిలోని నివాసితులు, సందర్శకులు ఉత్సాహంగా ఈ బెలూన్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు.
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి.. పర్యాటకులకు ఒకే ట్రిప్ లో వినోదంతో పాటు ఆధ్యాత్మిక భావన కూడా అందించింది. వారణాసిలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్, బోట్ రేసింగ్ ఫెస్టివల్ జరిగింది. ఈ ఫెస్టివల్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రేమలో పడ్డారు. జనవరి 17 నుండి జనవరి 20 మధ్య కాశీలో అంతర్జాతీయ బెలూన్ , బోట్ ఫెస్టివల్ ఉత్సవాలను రాష్ట్ర పర్యాటక శాఖ అత్యంత ఘనంగా నిర్వహించింది. వారణాసిలోని నివాసితులు, సందర్శకులు ఉత్సాహంగా ఈ బెలూన్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు.
ఇన్‌క్రెడిబుల్ ఇండియా ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ ఫెస్టివల్ వీడియోలను షేర్ చేసింది. గంగానది, వారణాసి నగరంపై హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రజలు తిరుగుతూ.. పక్షిల్లా ఆకాశంలో విహరిస్తూ ఎంజాయ్ చేసిన వీడియోలు అని క్యాప్షన్ జత చేసింది.
Lift up your spirits as you fly like a bird, hovering over the ancient city of Varanasi at the grand Balloon Festival.
Are you planning to board on this adventurous ride?
Video Credit: @harshit_pallav (Instagram)@uptourismgov #DekhoApnaDesh
1/2 pic.twitter.com/9TEF5TtFIm
— Incredible!ndia (@incredibleindia) January 19, 2023
భారతదేశం అందం, సంస్కృతి ఎంత చైతన్యవంతంగా ఉందో రుజువు చేసే చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌కు సంబంధించిన చిత్రాలు, వీడియోలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
The +1 flight of the #KashiBalloonFestival takes place – one last thrill-experience. So many happy faces!#KashiBalloonAndBoatFestival #BalloonAndBoatFestival #Kashi #Varanasi #RethinkTourism #UPNahiDekhaTohIndiaNahiDekha pic.twitter.com/8vLGqGbnR6
— UP Tourism (@uptourismgov) January 21, 2023
బోట్ రేసింగ్ వారణాసిలోని గంగా నదిలో దశాశ్వమేధ్, నమో ఘాట్‌ల మధ్య జరిగింది. ఈ బోట్ రేసింగ్‌లో గంగపుత్ర, నావిక్ సేన, కాశీ లాహిరి, జల్ యోధాస్, కాశీ కీపర్స్, గంగా లాహిరి, నౌకా రైడర్స్, జల్ సేన, గంగా వాహిని, భాగీరథి సేవక్స్, గౌముఖ్ జెయింట్స్, ఘాట్ కీపర్ల జట్లు పాల్గొన్నాయి. విమానాలు, టెథర్డ్ ఫ్లైట్, నైట్ గ్లోస్ వంటి ప్రత్యేక ఏర్పాట్లతో హాట్ ఎయిర్ బెలూనింగ్ ఫెస్ట్‌ను సందర్శకులు ఆస్వాదించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..