Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Case: శ్రద్ధా హత్య కేసులో 3000 పేజీల చార్జిషీట్.. 100 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు

న్యాయ నిపుణుడి అభిప్రాయం తెలుసుకున్న అనంతరం..  ఈ వారంలోనే కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. అఫ్తాబ్ మే 18న తన లివ్ ఇన్ పార్ట్‌నర్ శ్రద్ధా వాకర్‌ను గొంతు కోసి హత్య చేశాడు. రెండు రోజుల తర్వాత నిందితులు శ్రద్ధ మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి.. 18 రోజుల్లో ఈ ముక్కలను వేర్వేరు ప్రదేశాల్లో విసిన సంగతి తెలిసిందే

Shraddha Case: శ్రద్ధా హత్య కేసులో 3000 పేజీల చార్జిషీట్.. 100 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు
Shraddha Walkar Case
Follow us
Surya Kala

|

Updated on: Jan 22, 2023 | 3:23 PM

దేశంలోనే సంచలనం సృష్టించిన శ్రద్ధా హత్య కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు 3000 పేజీలతో చార్జిషీటును సిద్ధం చేశారు. ఈ ఛార్జ్ షీట్‌లో..  నిందితుడు అఫ్తాబ్ కు సంబందించిన నార్కో టెస్ట్, పాలిగ్రఫీ, DNA పరీక్షల నివేదికలను కూడా చేర్చారు. అంతే కాకుండా 100 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు జత చేశారు. తాము తయారు చేసిన చార్జిషీట్ ఫూల్‌ప్రూఫ్‌గా ఉందని, చాలా బలంగా ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ చార్జిషీట్‌ను కోర్టులో సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ చార్జ్ షీట్ ను ప్రస్తుతం న్యాయనిపుణులు పరిశీలిస్తున్నారు.

ఢిల్లీ పోలీసు అధికారులు కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఛార్జిషీట్‌ను వీలైనంతగా బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేశారు.  ఘటనకు సంబంధించిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో.. అడవిలో లభించిన ఎముకల DNA రిపోర్ట్ తో పాటు, నిందితుడు అఫ్తాబ్ నార్కో , పాలిగ్రాఫ్ పరీక్ష సహా ఇతర ఫోరెన్సిక్ పరీక్షల నివేదికను కూడా పోలీసులు జత చేశారు. ఈ మొత్తం కథనాన్ని సాక్షుల వాంగ్మూలాలతో నిరూపించేందుకు పోలీసులు కూడా ప్రయత్నించారు. మొత్తం ఛార్జ్ షీట్‌ను మళ్లీ అధ్యయనం చేయడానికి న్యాయ నిపుణుల వద్దకు పంపించారు.

ఈ వారంలో చార్జిషీటు కోర్టుకు రానుంది న్యాయ నిపుణుడి అభిప్రాయం తెలుసుకున్న అనంతరం..  ఈ వారంలోనే కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అఫ్తాబ్ మే 18న తన లివ్ ఇన్ పార్ట్‌నర్ శ్రద్ధా వాకర్‌ను గొంతు కోసి హత్య చేశాడు. రెండు రోజుల తర్వాత నిందితులు శ్రద్ధ మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి.. 18 రోజుల్లో ఈ ముక్కలను వేర్వేరు ప్రదేశాల్లో విసిరాడు. నేరం చేసిన తరువాత..  నిందితుడు మృతదేహాన్ని చెడిపోకుండా ఉండే విధంగా ఫ్రిజ్ కొనుగోలు చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికేందుకు రంపాలు, కత్తులు మొదలైనవి కొనుగోలు చేశాడు. శ్రద్ధ ముక్కలను వివిధ ప్రాంతాల్లోకి విసిరి.. అఫ్తాబ్ ముంబైకి తిరిగి వచ్చాడు. శ్రద్ధా మొబైల్ ఫోన్‌ను రైలులోంచి దారిలో ఎక్కడో విసిరేశాడు.

పోలీసుల విచారణలో అఫ్తాబ్ స్వయంగా తన నేరాన్ని అంగీకరించాడు. అయితే, సంఘటనలో పోలీసులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నాలు చేశాడు. దీంతో మొత్తం ఘటనకు సంబంధించిన లింక్‌లను కలిపే విషయంలో పోలీసులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నిందితులకు మొదటి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా చేశారు. అది విజయవంతం కాకపోవడంతో లై డిటెక్టర్, నార్కో టెస్ట్ కూడా చేయాల్సి వచ్చింది.

మెహ్రౌలీలోని ఛతర్‌పూర్ ,  గురుగ్రామ్‌లోని DLF ఫేజ్ I ఏరియా నుండి శ్రద్ధా కొన్ని శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ శరీర భాగాలన్నింటి DNA పరీక్షలను చేయించారు. అవి శ్రద్ధ తండ్రి DNA నివేదికతో సరిపోల్చారు. వీటిల్లో కొన్ని  ఎముకలు శ్రద్ధా శరీరానికి చెందినవి అని పరీక్షల్లో వెల్లడైంది. దీనితో పాటు, శ్రద్ధను చంపిన తర్వాత, నిందితుడు అఫ్తాబ్ ఈ ఎముకలను అడవిలో విసిరినట్లు కూడా నిర్ధారించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..