ప్రియుడితో పారిపోయిన భార్య.. మామను చంపిన అల్లుడు

పెళ్లయ్యాక కొంతమంది భర్తలు ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం.. అలాగే కొంతమంది భార్యలు కూడా ఇలానే చేయడం షరా మాములే. మరికొంత మంది భార్యలు ఇతర వ్యక్తులతో లేచిపోయిన సంఘటనలు కూడా ఎన్నో జరిగాయి.

ప్రియుడితో పారిపోయిన భార్య.. మామను చంపిన అల్లుడు
crime
Follow us
Aravind B

|

Updated on: Mar 30, 2023 | 6:34 PM

పెళ్లి ఏడేడు జన్మల బంధం.. భార్యభర్తల మధ్య ఏనాడూ విడిపోని అనుబంధం.. ఎన్నటికీ మరువని అనురాగం. అయితే కొందరు పక్క చూపులతో వివాహ బంధానికి తలవంపు తీసుకొస్తున్నారు. వివాహేతర సంబంధాలతో కుటుంబ వ్యవస్థలను చిన్నబుచ్చుతున్నారు. అయితే తాజాగా ఓ భర్త.. తన భార్య ఆమె ప్రియుడితో పారిపోయిందనే కోపంతో తనకు పిల్లనిచ్చిన మామనే కాల్చి చంపేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జల్నా జిల్లాలోని పైఠాన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల ఆమె తన ప్రియుడితో కలిసి పారిపోయింది. దీంతో కోపంతో రగిలిపోయిన అతడు అంబాద్ లో ఉంటున్న ఆమె తండ్రి వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగాడు. ఆ గొడవ తీవ్రతరం కావడంతో ఆ వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకీతో తన మామను కాల్చేశాడు. బుల్లెట్ దెబ్బకు తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో ఆ చోటు నుంచి ఆ వ్యక్తి వెంటనే పారిపోయాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకోని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..