Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20: ప్రపంచవ్యాప్తంగా ‘నాటు నాటు’ మేనియా..! జీ20ని కూడా ఊపేసింది..

కీరవాణి నాటు నాటు.. బీటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసుల్లో ‘నాటు’కుపోయింది. ఆ మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ నాటు బీటు జీ20 సమావేశాలనూ తాకింది. విదేశీ ప్రతినిధులతో సైతం స్టెప్పులేయించింది.

G20: ప్రపంచవ్యాప్తంగా 'నాటు నాటు' మేనియా..! జీ20ని కూడా ఊపేసింది..
G20
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 30, 2023 | 5:44 PM

రాజమౌళి తెరకెక్కించిన ట్రిపులార్‌ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులోని నాటు నాటు పాట ఆస్కార్‌ వేదికపై కళాకారులందరితో స్టెప్పులేయించింది. కీరవాణి నాటు నాటు.. బీటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసుల్లో ‘నాటు’కుపోయింది. ఆ మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ నాటు బీటు జీ20 సమావేశాలనూ తాకింది. విదేశీ ప్రతినిధులతో సైతం స్టెప్పులేయించింది. G20 ప్రెసిడెన్సీలో వ్యవసాయ వర్కింగ్ గ్రూప్ రెండవ అగ్రికల్చర్ డిప్యూటీస్ మీటింగ్ (ADM) సందర్భంగా G20 ప్రతినిధులు ఆస్కార్-విజేత ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్‌ చేశారు. అందుకు సంబంధించిన విజువల్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ప్రస్తుతం భారత దేశం అధ్యక్షతన ఛండీగడ్‌ వేదికగా జీ20 సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో ‘అగ్రికల్చర్ డిప్యూటీస్ మీటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్’ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ దేశాలనుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో భాగంగా ఏర్పాటుచేసిన కల్చరల్‌ ప్రోగ్రామ్‌లో స్థానిక కళాకారులతో కలిసి విదేశీ ప్రతినిధులు నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఆస్కార్ అవార్డులను గెలుచుకోవడానికి ముందు ఈ పాట ప్రపంచ వేదికపై అవార్డులను కైవసం చేసుకుంది. జనవరిలో ‘నాటు నాటు’ ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో గోల్డెన్ గ్లోబ్స్‌ను గెలుచుకుంది. ఐదు రోజుల తర్వాత, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 28వ ఎడిషన్‌లో ‘RRR’ మరో రెండు అవార్డులను కైవసం చేసుకుంది. ఒకటి ఉత్తమ పాట కోసం, మరొకటి ‘ఉత్తమ విదేశీ భాషా చిత్రం.’ ఈ పాట హిందీలో ‘నాచో నాచో’గా, తమిళంలో ‘నాట్టు కూతు’గా, కన్నడలో ‘హళ్లి నాటు’గా, మలయాళంలో ‘కరింతోల్’గా కూడా విడుదలైంది. దీని హిందీ వెర్షన్‌ను రాహుల్ సిప్లిగంజ్ మరియు విశాల్ మిశ్రా పాడారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన హుక్ స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారి ఎనర్జిటిక్ సింక్రొనైజేషన్ పాటను చూడటానికి ఒక ట్రీట్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..