గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్.. ఆహ్వానించిన ప్రధాని మోదీ..
వచ్చే ఏడాది (2021 జనవరి 26)వ తేదీన జరగనున్న భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రానున్నట్లు తెలుస్తోంది.
Republic Day: వచ్చే ఏడాది (2021 జనవరి 26)వ తేదీన జరగనున్న భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రానున్నట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వం పంపిన ఆహ్వానం మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ గణతంత్ర వేడుకలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని పీఎంవో వర్గాలు తెలిపాయి. నంబవర్ 27వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా బ్రిటన్ ప్రధాని బోరిస్‌కు ఫోన్ చేశారు. ఆ సందర్భంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా బోరిస్‌ను మోదీ కోరారు. ఈ విషయాన్ని పీఎంవో అధికారులు ధృవీకరించారు. ప్రతి ఏటా నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు మిత్రదేశాధినేతలకు భారత్ ఆహ్వానం పలుకుతున్న విషయం తెలిసిందే.