కేరళలో కొనసాగుతున్న కరోనా తీవ్రత.. 24 గంటల్లో 6,316 కరోనా కేసులు.. 28 మరణాలు..
మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,316 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒక్కరోజులో కరోనా బారిన పడి...
కేరళలో కరోనా వైరస్ ప్రకోపానికి విలవిలలాడుతోంది. నిత్యం రికార్డుస్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,316 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒక్కరోజులో కరోనా బారిన పడి 28 మంది మృత్యువాతపడ్డారు.
దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,14,673కు చేరింది. ఇక ఇప్పటివరకు మరణాల సంఖ్య 2298కు పెరిగింది. గత 24 గంటల్లో 5,924 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
దీంతో ఇప్పటి వరకు 5,50,788మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేరళ ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా వైరస్ బారినపడి ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 61,455 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.