ఏపీ శిరోముండ‌నం కేసుపై స్పందించిన రాష్ట్ర ప‌తి కార్యాల‌యం

ఏపీ శిరోముండ‌నం కేసుపై స్పందించిన రాష్ట్ర ప‌తి కార్యాల‌యం

ద‌ళిత యువ‌కుడి శిరోముండ‌నం కేసుపై రాష్ట్ర‌ప‌తి కార్యాయ‌లం స్పందించింది. ఇటీవ‌లే రాష్ట్ర‌ప‌తికి లేఖ రాశాడు బాధితుడు ప్ర‌సాద్. బాధ్యుల‌పై స‌త్వ‌ర చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏపీ ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప‌తి కార్యాల‌యం. ఇప్ప‌టికే బాధిత అధికారుల‌పై..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 12, 2020 | 3:50 PM

ద‌ళిత యువ‌కుడి శిరోముండ‌నం కేసుపై రాష్ట్ర‌ప‌తి కార్యాయ‌లం స్పందించింది. ఇటీవ‌లే రాష్ట్ర‌ప‌తికి లేఖ రాశాడు బాధితుడు ప్ర‌సాద్. బాధ్యుల‌పై స‌త్వ‌ర చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏపీ ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప‌తి కార్యాల‌యం. ఇప్ప‌టికే బాధిత అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకున్నట్టు రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యానికి స‌మాచారం పంపించింది ఏపీ ప్ర‌భుత్వం.

కాగా తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌‌మండ్రి అర్బ‌న్ సీతా న‌గ‌రంలోని వెదుళ్ల‌ప‌ల్లిలో పోలీస్ స్టేష‌న్‌లో శిరోముండ‌నం చేసిన‌ ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ఎస్ఐ ఫిరోజ్‌తో పాటు ఓ కానిస్టేబుల్‌ని కూడా సస్పెండ్ చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా న‌మోదు చేశారు. ఇసుక లారీల‌ను అడ్డుకున్నందుకు త‌న‌పై దాడి చేశార‌ని బాధితుడి అప్ప‌ట్లో ఆరోపించాడు. పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లిన పోలీసులు త‌న‌ను తీవ్రంగా కొట్టి శిరోముండ‌నం చేశార‌ని తెలిపాడు. దీంతో ఈ విష‌యం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయిన విష‌యం తెలిసిందే.

Read More:

బాలీవుడ్ ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కుడి ఆరోగ్యం విష‌మం

రేప్ చేస్తామ‌ని క్రికెట‌ర్ షమీ భార్య‌కు బెదిరింపులు

క‌రోనాతో మ‌ర‌ణించిన మాజీ ఎమ్మెల్యే మ‌న‌వ‌ళ్లు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu