ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు.. కన్న తల్లిదండ్రులనే హత్య చేసిన కూతురు

ఉత్తరప్రదేశ్ లో దారణం చోటుచేసుకుంది. కనిపెంచిన తల్లిదండ్రులనే వాళ్ల కూతురు హత్య చేయడం కలకలం రేపింది. ప్రియుడితో మాట్లడవద్దని చెప్పినందుకే ఆ కూతురు అతి కిరాతకంగా హత్య చేసింది.

ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు.. కన్న తల్లిదండ్రులనే హత్య చేసిన కూతురు
Crime
Follow us
Aravind B

|

Updated on: Mar 30, 2023 | 8:08 PM

ఉత్తరప్రదేశ్ లో దారణం చోటుచేసుకుంది. కనిపెంచిన తల్లిదండ్రులనే వాళ్ల కూతురు హత్య చేయడం కలకలం రేపింది. ప్రియుడితో మాట్లడవద్దని చెప్పినందుకే ఆ కూతురు అతి కిరాతకంగా హత్య చేసింది. మార్చి 15న ఈ దారణం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే బులందషహర్ ప్రాంతంలో మహ్మద్ షబ్బీర్ (47), రెహానా(44) కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి నలుగురు కూతుళ్లు. పెద్దమ్మాయికి 15 ఏళ్లు. ఈమె ప్రస్తుతం 8వ తరగతి చదువుతోంది. అయితే ఇటీవలే ఈ బాలికకు ఓ యువకుడితో(22) పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ప్రియుడితో తరుచూ ఫోన్లో మాట్లాడటం, బయట తిరగడం గమనించిన తల్లిదండ్రులు కూతురిని మందలించారు. అయినా కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో కొన్ని రోజులుగా ఆమెను తల్లిదండ్రులు పాఠశాలకు పంపించడం లేదు. దీంతో తల్లిదండ్రులపై కోపం పెంచుకున్న కూతురు వారి నుంచి ఎలాగైన అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నింది. మార్చి 14న మెడికల్‌ షాప్‌లో పనిచేసే తన ప్రియుడి ద్వారా నిద్రమాత్రలు తీసుకొచ్చింది. వీటిని అన్నంలో కలిపి తల్లిదండ్రులకు ఇచ్చింది.

అన్నం తిన్న తర్వాత దంపతులు ఇంటి ముందు మంచంపై నిద్రపోయారు. దీంతో కూతురు గొడ్డలితో తల్లిదండ్రుల తలలు నరికి చంపింది. మృతదేహాలను బెట్‌షీట్‌తో కప్పేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి బయట నుంచి తాళం వేసి, తాళాలను తన తండ్రి దిండు కింద దాచిఉంచింది. అనంతరం పక్కింటి వాళ్ల డాబా ఎక్కి ఇంట్లోకి వెళ్లి పడుకుంది. పొరిగింటి వారి సమాచారంతో అనుమానస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు కూతురిని విచారించగా అసలు విషయం బయటపడింది. తన ప్రియుడితో మాట్లాడకూడదని చెప్పినందుకే తల్లిదండ్రులను చంపినట్లు పోలీసుల ముందు ఆమె ఒప్పుకుంది. ఆమెను అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు. అలాగే ఆమెకు సహకరించిన ప్రియుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?