Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GBS Virus: కలవరపెడుతున్న GBS వైరస్.. పదేళ్ల బాలుడి మరణంతో 7కు చేరుకున్న మృతుల సంఖ్య

కరోనా కష్టాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఇంతలోనే ఇప్పుడు మరో మరో వైరస్‌ కలకలం రేపుతోంది. గులియన్ బారే సిండ్రోమ్..GBS -కేసులు పెరుగుతున్నాయి. దగ్గినా ..తుమ్మినా..జ్వరం వచ్చినా సరే GBS అటాక్‌ అయిందా? అని హడలిపోయేలా మారింది పరిస్థితి. ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో గులియన్‌ బారే సిండ్రోమ్‌ పాజిటివ్‌ కేసులు రిజిష్టరయ్యాయి.

GBS Virus: కలవరపెడుతున్న GBS వైరస్.. పదేళ్ల బాలుడి మరణంతో 7కు చేరుకున్న మృతుల సంఖ్య
Gbs Virus
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 05, 2025 | 9:48 AM

GBS – గులియన్ బారే సిండ్రోమ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని పూణేలో GBS రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇక్కడ రోగుల సంఖ్య 158 కి చేరుకుంది. దేశవ్యాప్తంగా 166 కేసులు నమోదయ్యాయి. ఇటు తెలంగాణలోని హైదరాబాద్‌లోనూ ఒక కేసు వెలుగు చూసింది. ముఖ్యంగా పూణేలో కలుషిత నీటి కారణంగా రోగుల సంఖ్య పెరుగుతోందని భయపడుతున్నారు. ఎక్కువ కేసులు పూణే , దాని పరిసర ప్రాంతాల నుండి వచ్చాయి. తాజాగా మరో పదేళ్ల బాలుడి మృతితో ముృతుల సంఖ్య 7కు చేరుకుంది.

ఆరోగ్య శాఖ అధికారుల ప్రకారం, 31 మంది రోగులు పూణే మునిసిపల్ కార్పొరేషన్ నుండి, 83 మంది రోగులు సింహగడ్ రోడ్, కిర్కిట్వాడి, నందోషి అదే ప్రాంతంలోని కొన్ని గ్రామాలకు చెందినవారుగా గుర్తించారు. వీరితో పాటు, 18 మంది రోగులు పింప్రి చిన్చ్వాడ్ నుండి, 18 మంది రోగులు పూణే గ్రామీణ ప్రాంతానికి చెందినవారు. 8 మంది రోగులు ఇతర జిల్లాలకు చెందినవారు. ఇప్పటివరకు 38 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. అదే సమయంలో, 21 మంది రోగులు వెంటిలేటర్‌పై ఉన్నారు.

మహారాష్ట్రలో గిలియన్-బారే సిండ్రోమ్ (GBS) కారణంగా మరణించిన వారి సంఖ్య మంగళవారం (ఫిబ్రవరి 04) నాటికి 7 కి పెరిగింది. ఈ విషయంలో ఆరోగ్య శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. జనవరి 31న చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్‌లో చేరిన పదేళ్ల బాలుడు మంగళవారం మరణించాడు. తమిళనాడులో తొలి గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (GBS) బాధితుడిగా నిర్ధారించారు. గత నెల నుండి ఈ అరుదైన వ్యాధి ఇన్ఫెక్షన్ వల్ల సంభవించిన మరణాల సంఖ్య ఏడుకి చేరుకుంది. దేశవ్యాప్తంగా GBS మరణాలకు కారణం మహారాష్ట్ర పూణెలోని క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బాక్టీరియం వ్యాప్తికి కారణమనిఆ ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు.

పూణే నగరంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక నీటి నమూనాలను రసాయన, జీవ విశ్లేషణ కోసం ప్రజారోగ్య ప్రయోగశాలకు పంపారు. దర్యాప్తులో, ఎనిమిది నీటి వనరుల నుండి వచ్చిన నమూనాలు కలుషితమైనట్లు గుర్తించారు. పుణె నగరంలోని వివిధ ప్రాంతాల నుండి మొత్తం 160 నీటి నమూనాలను రసాయన, జీవ విశ్లేషణ కోసం ప్రయోగశాలకు పంపినట్లు ఒక అధికారి తెలిపారు. సింహగడ్ రోడ్ ప్రాంతంలోని కొన్ని ప్రైవేట్ బోర్‌వెల్‌ల నుండి తీసిన నమూనాలలో ఒకదానిలో ఎస్చెరిచియా కోలి లేదా ఇ-కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు కనిపించిందని అధికారి తెలిపారు. నీటిలో ఈ-కోలి ఉండటం అనేది మలం లేదా జంతువుల వ్యర్థాల నుండి వచ్చే మురికి వ్యాప్తికి సూచన అని ఆయన అన్నారు. ఇది GBS ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..