Encounter in Kupwara: భారత్‌లో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం.. ఒకరి హతం, ముగ్గురు సైనికులకు గాయాలు!

భారత్ - పాక్ సరిహద్దులో అలజడి చెలరేగింది. భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన పాక్ ఆర్మీని మన సైన్యం తరిమికొట్టింది. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో జరిగిన ఉగ్రదాడిపై సైన్యం కీలక ప్రకటన చేసింది. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ దాడి అని సైన్యం స్పష్టం చేసింది.

Encounter in Kupwara: భారత్‌లో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం.. ఒకరి హతం, ముగ్గురు సైనికులకు గాయాలు!
Kupwara Encounter
Follow us

|

Updated on: Jul 27, 2024 | 10:38 AM

భారత్ – పాక్ సరిహద్దులో అలజడి చెలరేగింది. భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన పాక్ ఆర్మీని మన సైన్యం తరిమికొట్టింది. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో జరిగిన ఉగ్రదాడిపై సైన్యం కీలక ప్రకటన చేసింది. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ దాడి అని సైన్యం స్పష్టం చేసింది. ఈ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారని తెలిపారు.

ఉత్తర కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై మచల్ సెక్టార్‌లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ జరిపిన దాడిని భారత సైన్యం భగ్నం చేశారు. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ ఉగ్రవాదుల బృందాన్ని భారత భూభాగంలోకి ప్రవేశించడానికి సహాయం చేస్తోంది. అయితే సెర్చ్‌ ఆపరేషన్‌లో భాగంగా భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌ చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కొందరు ఉగ్రవాదులు అడవి వైపు పారిపోయారని భద్రతా దళాలు ప్రకటించాయి. జమ్మూ కాశ్మీర్‌లో, గత కొన్ని వారాలుగా భద్రతా దళాలు మధ్య ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఇటీవల ఎల్‌ఓసీపై అనేక చొరబాటు ప్రయత్నాలను సైన్యం భగ్నం చేసింది.

శనివారం తెల్లవారుజామున, మచల్ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్‌ వైపు వెళ్తున్నవారిని భారత భద్రతా దళాలు పసిగట్టాయి. దీంతో వారిని ప్రశ్నించేలోపే.. పాక్ ఆర్మీకి చెందిన బ్యాట్ స్క్వాడ్ కాల్పులు జరిపి వెనక్కి పరుగులు తీసింది. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. దాదాపు మూడు గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో ముగ్గురు భారత సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బీఏటీకి చెందిన ఒక సభ్యుడు ప్రాణాలు కోల్పోయాడు.

గత మూడు రోజుల్లో కుప్వారాలో ఇది రెండో ఎన్‌కౌంటర్. ఈ ఎన్‌కౌంటర్ కుమ్కారి ప్రాంతంలో యాంటీ టెర్రరిజం ఆపరేషన్ సందర్భంగా జరిగింది. ఉగ్రవాద కార్యకలాపాల గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు కుమ్కారి ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించాయి. ఈరోజు ఇక్కడ ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందడంతో ఈ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు గాయపడ్డారు.

మంగళవారం (జూలై 23) కుప్వారాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ కూడా జరిగింది. యాంటీ టెర్రరిజం ఆపరేషన్ సందర్భంగా భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం ఆ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ మొదలైంది. ఇందులో ఓ ఆర్మీ జవాను వీరమరణం పొందాడు. అయితే భద్రతా బలగాలు అక్కడ ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. జమ్మూ కాశ్మీర్‌లోని కొండ జిల్లాల ఎగువ ప్రాంతాల్లో 40 నుండి 50 మంది పాక్ ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి వారిని అరెస్టు చేసేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!