జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుల దాడి.. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాల్పులు.. కౌన్సిలర్‌తో సహా ఇద్దరు మృతి
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్‌లో ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగబడ్డారు.
Terrorists attack : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్‌లో ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగబడ్డారు. బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (బిడిసి) సమావేశంలోకి చొరబడ్డ టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మున్సిపల్ కౌన్సిలర్ రియాజ్ , గన్‌మెన్ అహ్మద్ అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో మరికొందరు ప్రజా ప్రతినిధులు తీవ్రంగా గాయపడ్డారు.
ఉగ్రవాదుల దాడిలో మరో కౌన్సిలర్ షంషుద్దీన్ పీర్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న భద్రతా బలగాలు పెద్ద ఎత్తున సోపోర్ ప్రాంతానికి చేరుకుని కూంబింగ్ చేపట్టాయి కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఛైర్మన్ ఫరీదాఖాన్‌ను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. కాల్పుల్లో ఫరీదాఖాన్‌కు కూడా తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొనట్టు తెలుస్తోంది. దుండగులను గుర్తించడానికి పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లడపడుతున్నారు.
?Breaking News?
?Unidentified #Terrorists fired at Municipal Office #Sopore #kashmir.
?#Police personnel Shafqat & Riyaz Ahmad got #Martyred & councilor Sham got injured & is shifted to hospital for treatment.
?Meanwhile, Area cordoned off, further details to follow. pic.twitter.com/h3wwGhL1gv
— Kashmir Watch (@kashmir_watch) March 29, 2021