AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Term Insurance Policy: భారం కానున్న టర్మ్ పాలసీలు.. 40 శాతం పెరగనున్న ధరలు.. ఎప్పటి నుంచి, ఎందుకో తెలుసా?

రీఇన్సూరెన్స్ కంపెనీ మ్యూనిచ్ వివిధ కంపెనీల్లోని టర్మ్ పాలసీల రేట్లను 30 నుంచి 40 శాతం పెంచింది. దీంతో ప్రీమియం రేట్లు 25-30 శాతం పెరుగుతాయి.

Term Insurance Policy: భారం కానున్న టర్మ్ పాలసీలు.. 40 శాతం పెరగనున్న ధరలు.. ఎప్పటి నుంచి, ఎందుకో తెలుసా?
Term Insurance Policy Premium
Venkata Chari
|

Updated on: Nov 14, 2021 | 6:51 PM

Share

Term Insurance Policy: దేశంలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు 25-30 శాతం వరకు పెరగనున్నాయి. భారతీయ మార్కెట్లో అతిపెద్ద రీఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన మ్యూనిచ్ రీ తన టర్మ్ ఇన్సూరెన్స్ రేట్లను పెంచబోతోంది. దీంతో ఇతర బీమా కంపెనీలు కూడా పెంచుతాయనే వార్తలు వస్తున్నాయి. మ్యూనిచ్ పోర్ట్‌ఫోలియోను 40 శాతం వరకు పెంచింది. దీని కారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రీమియంలు కూడా ఖరీదైనవిగా మారనున్నాయి. దీంతో 8-10 బీమా కంపెనీలకు సమాచారం అందించినట్లు వర్గాలు తెలిపాయి. కొత్త రేట్లు డిసెంబర్ నుంచి అమల్లోకి రానున్నాయి. మ్యూనిచ్ టర్మ్ పాలసీల రేట్లను 30 నుంచి 40 శాతం పెంచబోతోంది.

కోవిడ్ మహమ్మారి బీమా ప్రీమియం రేటు పెరగడానికి కూడా ఇదే ప్రధాన కారణంగా నిలుస్తోంది. కోవిడ్ సమయంలో కంపెనీలపై చాలా ఒత్తిడి నెలకొంది. కంపెనీల వ్యయాలు అనేక రెట్లు పెరిగాయి. దీని కారణంగా, అండర్ రైటింగ్ పోర్ట్‌ఫోలియో శాతం కూడా పెరిగింది. దీంతో బీమా కంపెనీలు ప్రీమియం రేట్లను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రీమియం రేటు పెరుగుదల పరిధి కంపెనీ నుంచి కంపెనీకి మారుతూ ఉంటుంది. అన్ని కంపెనీలు ఒకే రేటుతో ప్రీమియం మొత్తాన్ని పెంచవు. కొత్త రేట్లు డిసెంబర్ నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కోవిడ్-19 మరణాల క్లెయిమ్‌లు మొత్తం 2021 ఆర్థిక సంవత్సరం క్లెయిమ్‌ల కంటే ఎక్కువగా ఉన్నాయి. నివేదిక ప్రకారం, కోవిడ్ మహమ్మారి రెండో దశ తర్వాత, కోవిడ్‌కు సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించడానికి జీవిత బీమా కంపెనీలు ఇప్పటివరకు రూ. 11,060.5 కోట్లు ఖర్చు చేశాయి. అక్టోబర్ 21 నాటికి, జీవిత బీమా కంపెనీలు 130,000 కంటే ఎక్కువ COVID-19 సంబంధిత డెత్ క్లెయిమ్‌లను పరిష్కరించాయి. ‘బిజినెస్ స్టాండర్డ్’ నివేదిక ప్రకారం ఇప్పటివరకు దాదాపు 140,000 కోవిడ్ సంబంధిత క్లెయిమ్‌లు చేశాయి. అంటే మొత్తం రూ. రూ. 12,948.98 కోట్లను క్లెయిమ్‌ల రూపంలో అందించాయి. అంటే దాదాపు 93.57 శాతం క్లెయిమ్‌లలో 85.42 శాతం ఇవే ఉన్నట్లు తెలుస్తోంది.

క్లెయిమ్ సెటిల్‌మెంట్‌పై భారం.. ఈ అధిక క్లెయిమ్‌ల భారం కారణంగా, రీఇన్స్యూరెన్స్ కంపెనీ అండర్‌రైటింగ్ పోర్ట్‌ఫోలియోపై 40 శాతం వరకు ఖరీదైనవిగా మారాయి. కరోనా సమయంలో మరణాల సంఖ్య పెరగడం, క్లెయిమ్‌ను పరిష్కరించే ఖర్చు మ్యూనిచ్ రీని ప్లాన్ ధరను పెంచడం గురించి ఆలోచించేలా చేసింది. మ్యూనిచ్ రిస్క్ కవర్ చేసే కంపెనీలకు ఇదే విషయాన్ని తెలియజేసింది. రేటు పెంచే విషయమై కంపెనీలకు సమాచారం అందించినట్లు పేర్కొంది.

రీఇన్స్యూరెన్స్ రేటులో పెంపు.. రీఇన్స్యూరెన్స్ రేట్లు 40శాతం వరకు పెరిగినందున, ప్రీమియం 30శాతం పెరిగే అవకాశం ఉంది. ఇది బీమా చేసిన వ్యక్తి వయస్సు, బీమా మొత్తం, వ్యక్తి యొక్క జీవనంపై ఆధారపడి ఉంటుంది. రీఇన్సూరెన్స్ కంపెనీ మ్యూనిచ్ వివిధ కంపెనీల్లో టర్మ్ పాలసీల రేట్లను 30-40 శాతం పెంచినట్లు అధికారి ఒకరు తెలిపారు. దీంతో ప్రీమియం రేట్లు 25-30 శాతం పెరుగనున్నాయి. 2021లో రీఇన్స్యూరెన్స్ రేట్లు పెంచడం ఇది రెండోసారి. 07 అక్టోబర్ 2021లో రీఇన్స్యూరెన్స్ రేట్లు పెంచారు. మార్చిలో రేట్లు 4-5 శాతం పెరిగాయి. గతేడాది జూన్‌లో 20-25 శాతం భారీ వృద్ధి నమోదైంది.

Also Read: PM Fasal Bima Yojana: కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకంలో దరఖాస్తులు పెరిగినా.. బెనిఫిట్ పొందిన రైతుల సంఖ్య తగ్గింది..!

Home Loan Charges: మీరు హోమ్‌ లోన్‌ తీసుకుంటున్నారా..? ఎలాంటి ఛార్జీలు ఉంటాయో గమనించండి