లోయలో నెలకొన్న ఉత్కంఠ.. 144 సెక్షన్..
కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కేంద్ర బలగాలను భారీగా మోహరించాయి. 10 వేలతో ప్రారంభమైన అదనపు బలగాల మోహరింపు.. 35 వేలకు పైగా చేరింది. దీంతో సర్వాత్రా ఉత్కంఠ నెలకొంది. కాశ్మీర్ లోయలో 144 సెక్షన్ విధించారు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అటు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడంతో పాటు.. ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ […]
కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కేంద్ర బలగాలను భారీగా మోహరించాయి. 10 వేలతో ప్రారంభమైన అదనపు బలగాల మోహరింపు.. 35 వేలకు పైగా చేరింది. దీంతో సర్వాత్రా ఉత్కంఠ నెలకొంది. కాశ్మీర్ లోయలో 144 సెక్షన్ విధించారు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అటు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడంతో పాటు.. ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అటు లోయలో తాజా పరిస్థితులు, పరిణామాలు, ఢిల్లీలోనూ హీట్ పెంచుతున్నాయి. పార్లమెంట్‌లో నేడు జమ్ముకశ్మీర్‌కు సంబంధించి కీలక బిల్లును ప్రవేశపెట్టనున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్‌కు సంబంధించి.. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ రెండో సవరణ బిల్లు-2019ను అమిత్ షా ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ముందుగా నిర్ణయించిన దానికంటే రెండు రోజుల ముందుగానే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారు. కేంద్ర కేబినెట్ గత వారమే ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇదే అంశంపై ఆదివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశమై కీలక చర్చలు జరిపింది. పార్లమెంట్‌లోని అమిత్ షా ఆఫీస్‌లో జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, “రా” చీఫ్ పాల్గొన్నారు. కశ్మీర్‌లో తాజా పరిస్థితుల నేపథ్యంలో జరిగిన ఈ అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం చర్చనీయాంశంగా మారింది.
ఇటు ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370ని రద్దు చేస్తే సహించేది లేదని.. మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా నివాసంలో జరిగిన అఖిలపక్ష భేటీ తేల్చి చెప్పింది. కాశ్మీర్‌లో తాజా పరిస్థితులపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశానికి పీడీపీ నేత మెహబూబా మూఫ్తీతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. రాజకీయ విభేదాలు మరిచి ప్రత్యర్ధులంతా ఏకమయ్యారు. హురియత్ నేత యాసిన్ మాలిక్, సజ్జద్ లోన్ కూడా ఈ భేటీకి హాజరుకావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కశ్మీర్‌లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. పలు జిల్లాల్లో ఆంక్షలు అమలుతోపాటు కర్ఫ్యూ విధించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో అక్కడి పరిస్థితినంతా కేంద్రం గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ మరికాసేపట్లో జరగబోయే కేంద్ర మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఆర్మీ స్థావరాలు, ఎయిర్ పోర్టులకు భారీగా భద్రతను పెంచారు.