నీటిలో మునిగిన సంగమేశ్వరుడు..!
సంగమేశ్వరాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ఈ ఆలయం కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమ ప్రదేశంలో వెలిసింది. అందుకే ఈ ఆలయానికి సంగమేశ్వరాలయం అని పేరొచ్చింది. కాగా.. గత పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంగమేశ్వర ఆలయలోకి నీరు పొటెత్తింది. దీంతో… ఆలయం మొత్తం నీటిలో మునిగిపోయి.. కేవలం గోపురం మాత్రమే దర్శనమిస్తోంది. దీంతో.. పూజారులు ఆలయ శిఖరానికి పూజలు చేసి.. సంగమేశ్వర స్వామికి వీడ్కోలు పలికారు. ప్రతీ సంవత్సరం ఈ ఆలయం […]
సంగమేశ్వరాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ఈ ఆలయం కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమ ప్రదేశంలో వెలిసింది. అందుకే ఈ ఆలయానికి సంగమేశ్వరాలయం అని పేరొచ్చింది. కాగా.. గత పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంగమేశ్వర ఆలయలోకి నీరు పొటెత్తింది. దీంతో… ఆలయం మొత్తం నీటిలో మునిగిపోయి.. కేవలం గోపురం మాత్రమే దర్శనమిస్తోంది. దీంతో.. పూజారులు ఆలయ శిఖరానికి పూజలు చేసి.. సంగమేశ్వర స్వామికి వీడ్కోలు పలికారు. ప్రతీ సంవత్సరం ఈ ఆలయం నీటిలో మునుగుతుంది.
వరద కారణంగా శ్రీశైలం రిజర్వాయర్ నిండింది. దీంతో.. జలాశయం జలసిరితో కళకళలాడుతోంది. జూరాల నుంచి పరుగులు పెడుతూ వస్తోన్న శ్రీశైలం బ్యాక్ వాటర్‌తో సంగమేశ్వర ఆలయం క్రమంగా నీటిలో మునిగిపోయింది. కాగా.. మరో కొద్ది రోజులు గుడి పూర్తిగా నీటిలో మునిగిపోనుంది. కాగా.. నిన్న సాయంత్రానికి జలాశయంలో 100 టీఎంసీల నీరు చేరుకోగా, నీటిమట్టం 858 అడుగులు దాటింది. అయితే.. కర్నాటక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో వరద మరో నాలుగు రోజులు రావచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో.. మరో 50 టీఎంసీలకు పైగా నీరు చేరే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.