ఫ్లాట్‌ఫామ్ టికెట్‌తోనే ట్రైన్‌‌లో ప్రయాణించవచ్చంట..!

ఏంటి షాక్ అవుతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. మాములూగా.. బంధువులు వస్తే రిసీవ్ చేసుకోవడానికో.. లేదా.. బంధువులను ఎక్కించడానికో మనం ఫ్లాట్‌ఫామ్ టికెట్ తీసుకుంటాం. కానీ.. దాంతో కూడా రైలు ప్రయాణం చేయవచ్చంట. సాధారణంగా ఒక్కోసారి.. ట్రైన్ తొందరగా రావచ్చు. లేకపోతే.. మీరు ఆసల్యం చేయవచ్చు.. మరోసారి.. రైల్వేస్టేషన్‌లోని టికెట్ కౌంటర్ వద్ద భారీ లైన్లు ఉండవచ్చు. అలాంటప్పుడు.. ఫ్లాట్‌ఫామ్ టికెట్‌ తీసుకుని.. దాంతో రైలు ప్రయాణం చేయవచ్చని రైల్వే సంస్థ అధికారులు తెలిపారు. అయితే.. […]

ఫ్లాట్‌ఫామ్ టికెట్‌తోనే ట్రైన్‌‌లో ప్రయాణించవచ్చంట..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 05, 2019 | 8:14 AM

ఏంటి షాక్ అవుతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. మాములూగా.. బంధువులు వస్తే రిసీవ్ చేసుకోవడానికో.. లేదా.. బంధువులను ఎక్కించడానికో మనం ఫ్లాట్‌ఫామ్ టికెట్ తీసుకుంటాం. కానీ.. దాంతో కూడా రైలు ప్రయాణం చేయవచ్చంట.

సాధారణంగా ఒక్కోసారి.. ట్రైన్ తొందరగా రావచ్చు. లేకపోతే.. మీరు ఆసల్యం చేయవచ్చు.. మరోసారి.. రైల్వేస్టేషన్‌లోని టికెట్ కౌంటర్ వద్ద భారీ లైన్లు ఉండవచ్చు. అలాంటప్పుడు.. ఫ్లాట్‌ఫామ్ టికెట్‌ తీసుకుని.. దాంతో రైలు ప్రయాణం చేయవచ్చని రైల్వే సంస్థ అధికారులు తెలిపారు. అయితే.. దీనికి కూడా కండీషన్స్‌ అప్లై.. ఫ్లాట్‌ఫామ్ టికెట్‌తో ట్రైన్ ఎక్కాక గార్డ్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి.. తాను ఏ పరిస్థితుల్లో అలా ఎక్కానో గార్డ్‌కి వివరించాలని తెలిపారు. ఒకవేళ గార్డ్ అందుబాటులో లేకపోతే.. రైల్వే స్టాఫ్ పర్మిషన్ కూడా తీసుకోవచ్చు. గార్డ్ సర్టిఫికేట్ తర్వాత టీటీఈ నుంచి ట్రైన్ టికెట్ పొందవచ్చు. అప్పుడు కాస్త ఫైన్ పడుతుందని.. అది కట్టేస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు.

కాగా.. ఎవరైనా ప్యాసింజర్ కావాలనే ఫ్లాట్‌ఫామ్ టికెట్ జర్నీ చేస్తున్నాడని టీటీకి తెలుస్తే మాత్రం.. ఏకంగా రూ.1000కి పైగా జరిమానా విధించే అవకాశముంది. అలాగే.. ఆరు నెలల జైలు శిక్ష కూడా పడొచ్చు. కొన్ని సందర్భాల్లో రెండించటికి ఛాన్స్ ఉంటుంది. సో.. దొరికిందికదా అని ఛాన్స్ తీసుకోకండి.. మీరే ఇరుక్కోవాలి.