టైలర్‌ షాపులో గ్రైనేడ్లు, ఆయుధాలు

జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో భారీ భద్రతను ఏర్పాటు చేసి.. యాత్రికులను స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా బలగాలు కట్టుదిట్టమైన భద్రతను చేపట్టారు. ఎల్ఓసీ ప్రాంతాంలోని కుప్వారా జిల్లాలో ఆదివారం ఓ షాపులో పేలుడు సంభవించింది. కెరాన్‌లోని ఓ టైలర్ దుకాణంలో బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. అయితే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. షాపులో తనిఖీలు […]

టైలర్‌ షాపులో గ్రైనేడ్లు, ఆయుధాలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 05, 2019 | 9:19 AM

జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో భారీ భద్రతను ఏర్పాటు చేసి.. యాత్రికులను స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా బలగాలు కట్టుదిట్టమైన భద్రతను చేపట్టారు. ఎల్ఓసీ ప్రాంతాంలోని కుప్వారా జిల్లాలో ఆదివారం ఓ షాపులో పేలుడు సంభవించింది. కెరాన్‌లోని ఓ టైలర్ దుకాణంలో బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. అయితే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. షాపులో తనిఖీలు చేపట్టారు. దుకాణంలో ఓ మూలన 15 గ్రేనేడ్లు, పలు ఆయుధాలను గుర్తించారు. షాపు యజమాని పర్వేజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. గ్రేనేడ్లతో పాటు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.