AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆశ దోశ.. ఆ ప్రచారంతో పోస్టాఫీసుకు పోటెత్తిన మహిళలు.. చివరకు పోలీసులు రంగ ప్రవేశం

అదిగో తోక అంటే ఇదిగో పులి అనే నేచర్ మనిషి సొంతం. ఇక ఒక చిన్న పని చేస్తే చాలు డబ్బులు వస్తాయనే పుకారు వినిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది..అంటే తాజా సంఘటన సజీవ సాక్షంగా నిలుస్తుంది. మహిళలు పొదుపు ఖాతా తెరిస్తే చాలు ఒకొక్కరికి 8 వేల రూపాయలు వస్తాయని.. అది కూడా సోమవారం లాస్ట్ డే అని తెలిసింది. ఇంకేముందు పోలో మంటూ ఆడవారు పోస్టాఫీసుకు క్యూలు కట్టారు. దీంతో ఆ పోస్టాఫీసులో పని చేస్తున్న సిబ్బంది తల ప్రాణం తోకకు వచ్చింది. ఈ సంఘటనకు వేదికగా బెంగళూరు మారింది.

ఆశ దోశ.. ఆ ప్రచారంతో పోస్టాఫీసుకు పోటెత్తిన మహిళలు.. చివరకు పోలీసులు రంగ ప్రవేశం
Money Rumours SpreadImage Credit source: Twitter
Surya Kala
|

Updated on: May 29, 2024 | 12:18 PM

Share

అదిగో తోక అంటే ఇదిగో పులి అనే నేచర్ మనిషి సొంతం. ఇక ఒక చిన్న పని చేస్తే చాలు డబ్బులు వస్తాయనే పుకారు వినిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది..అంటే తాజా సంఘటన సజీవ సాక్షంగా నిలుస్తుంది. మహిళలు పొదుపు ఖాతా తెరిస్తే చాలు ఒకొక్కరికి 8 వేల రూపాయలు వస్తాయని.. అది కూడా సోమవారం లాస్ట్ డే అని తెలిసింది. ఇంకేముందు పోలో మంటూ ఆడవారు పోస్టాఫీసుకు క్యూలు కట్టారు. దీంతో ఆ పోస్టాఫీసులో పని చేస్తున్న సిబ్బంది తల ప్రాణం తోకకు వచ్చింది. ఈ సంఘటనకు వేదికగా బెంగళూరు మారింది.

బెంగుళూరులో సోమవారం (మే 27) వేలాది మంది మహిళలు పొదుపు ఖాతాలను తెరవడానికి జనరల్ పోస్ట్ ఆఫీస్ (GPO)లో క్యూ కట్టారు. ఇలా పొదుపు ఖాతా తెరవడం వలన ఒక్కొక్కరికి 8,000 రూపాయలు లభిస్తాయని.. అది కూడా రాజకీయ పార్టీలు పోస్టాఫీసు ఖాతాల్లోకి 8,000 రూపాయలు బదిలీ చేస్తున్నాయని వాట్సాప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ పుకారు షికారు చేసింది. ఇంకేముందు పోస్టాఫీసులో ఖాతా తెరచేందుకు భారీ సంఖ్యలో మహిళలు చేరుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఘోరంగా మారింది. ఒక్కసారిగా వేలాది మహిళలు రావడంతో ఖాతాను తెరచే ప్రక్రియను సులభతరం చేయడానికి జనరల్ పోస్ట్ ఆఫీస్ అదనపు సిబ్బందిని నియమించాల్సి వచ్చింది. నివేదికల ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు మొదలైన ఖాతాదారుల రద్దీని నియంత్రించడానికి పోస్టాఫీస్ సిబ్బంది పోలీసుల సహాయాన్ని కోరింది.

పుష్కలంగా షికారు చేసిన పుకార్లు

  1. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కింద తెరిచిన ప్రతి ఖాతాలో పోస్టల్ డిపార్ట్‌మెంట్ డబ్బును జమ చేస్తుందని గత వారం రోజులుగా వాట్సాప్, ఆర్‌డబ్ల్యుఎలలో పుకార్లు వ్యాపించాయి.
  2. ఈ ప్రయోజనాన్ని పొందాలంటే ఖాతా తెరవడానికి సోమవారం చివరి రోజు అని మెసేజ్ లో ఉంది. దీంతో భారీ సంఖ్యలో మహిళలు జనరల్ పోస్ట్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు.
  3. ఇవి కూడా చదవండి
  4. నగదు ప్రోత్సాహకం పొందేందుకు ఖాతా తెరవడమే తొలి మెట్టు అని కొందరు నమ్ముతున్నారు. మరికొందరు.. ఇప్పటికే ఈ నగదు జమ మొదలైందని.. తపాలా శాఖ కొందరి ఖాతాల్లో 8వేలు జమ చేయడం ప్రారంభించిందని అభిప్రాయపడ్డారు.
  5. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. జనరల్ పోస్ట్ ఆఫీస్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ HM మంజేష్ ఆఫీసు ఎంట్రీ గేట్ల వద్ద “పోస్టాఫీస్ ఎటువంటి నగదు ప్రోత్సాహకాలను ప్రకటించలేదని, తపాలా శాఖ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదని పోస్టర్‌లను అతికించినది. అయినా సరే ఈ విషయాన్ని పట్టించుకోకుండా భారీ సంఖ్యలో మహిళలు నగదు ప్రోత్సాహం అందుతుందని ఆశతో పోస్టాఫీస్ వద్ద ఖాతా తెరవడానికి పోటెత్తారు.
  6. జనరల్ పోస్ట్ ఆఫీస్ లోని ఒక అధికారి ఈ విషయంపై మాట్లాడుతూ.. వాస్తవానికి తాము సగటున రోజూ 100 నుంచి 200 ఖాతాలను తెరుస్తామని చెప్పారు. అయితే గత ఒక వారంలో మేము GPOలో రోజులో 700 నుంచి 800 ఖాతాలను ప్రారంభించామని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..