Amit Shah: ఇకపై తెలంగాణలో తరచూ పర్యటిస్తా.. కేసీఆర్ ట్రాప్‌లో పడకండంటూ నేత‌ల‌కు అమిత్ షా దిశానిర్దేశం!

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం, రాష్ట్రం ఒకరిపై మరొకరు నిందించుకుంటున్నారు. ఈ త‌రుణంలోనే.. ఇవాళ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలు, రాష్ట్ర నేత‌లతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను క‌లిశారు.

Amit Shah: ఇకపై తెలంగాణలో తరచూ పర్యటిస్తా.. కేసీఆర్ ట్రాప్‌లో పడకండంటూ నేత‌ల‌కు అమిత్ షా దిశానిర్దేశం!
Amit Sha
Follow us

|

Updated on: Dec 21, 2021 | 4:46 PM

Telangana BJP Leaders meet Amit Shah: గ‌త కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ స‌ర్కార్ ల మ‌ధ్య వివాదం చెల‌రేగుతున్న సంగ‌తి తెలిసిందే. ధాన్యం కొనుగోలు అంశంపై రెండు ప్రభుత్వాల మ‌ధ్య రాజకీయ యుద్దమే కొనసాగుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో ఒకరిపై మరొకరు నిందించుకుంటున్నారు. ఈ త‌రుణంలోనే.. ఇవాళ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలు, రాష్ట్ర నేత‌లతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను క‌లిశారు. ఈ సందర్భంగా నేతలను ఉద్ధేశించి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్‌పై ప్రత్యక్ష రాజకీయ సమరానికి సిద్ధం కావాలని సూచించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర పర్యటనకు తాను రానున్నట్లు ఈ సంద‌ర్భంగా హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అయితే, ఆయ‌న డేట్ మాత్రం ఫిక్స్ చేయ‌లేదని తెలుస్తోంది. . ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల‌ని.. కేసీఆర్ ట్రాప్ లో పడకండంటూ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు అమిత్ షా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ అవినీతికి సంబంధించిన విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. హుజురాబాద్ తరహాలోనే రాబోయే ఎన్నికల్లో గెలవాలని నాయకులకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మీరు చేయాల్సింది మీరు చేయండి.. ప్రభుత్వపరంగా ఏమి చేయాలో తమకు వదిలేయాలని ఆయన పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలో తరచూ పర్యటిస్తానని నాయకులకు అమిత్‌షా హామీ ఇచ్చారు.

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ మంత్రులు, ఈటల రాజేందర్‌, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్‌, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి , విజయశాంతి ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌తో సహా పలువురు ముఖ్య నేతలంతా అమిత్‌షాతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని అమిత్‌షా ఛాంబర్‌లో జరిగిన ఈ భేటీకి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా హాజరయ్యారు.

Read Also…  Anti-Conversion Bill: కర్ణాటక రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. శాసనసభ ముందుకు మతమార్పిడి నిరోధక బిల్లు!

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?