19 ఏళ్ల యువతిపై 23 మంది గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ యువతిని కిడ్నాప్ చేసి, వారం రోజుల వ్యవధిలో 23 గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుండగులు. వీరిలో ఆరుగురిని అరెస్ట్ చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. పూర్తి డీటేల్స్ ఇలా ఉన్నాయి..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో దారుణ ఘటన వెలుగు చూసింది. 19 ఏళ్ల యువతిపై గ్యాంప్ రేప్ జరిగింది. 23 మంది కీచకులు 6 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు మత్తు మందిచ్చి.. పలు హోటళ్లు తిప్పుతూ ఈ అఘాయిత్యం చేశారు. నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్టుచేశారు.
మార్చి 29న బాధితురాలు కొంత మంది స్నేహితులతో కలిసి బయటకు వెళ్లారు. తిరిగి రాకపోవడంతో ఈ నెల 4వ తేదీన పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను పోలీసులు రక్షించారు. అప్పుడు అత్యాచారం గురించి ఆమె చెప్పలేదు. కానీ 6వ తేదీన ఆమె కుటుంబ సభ్యులు సామూహిక అత్యాచారంపై ఫిర్యాదు చేశారు. దీంతో వివరాలను పోలీసులకు ఆ యువతి వెల్లడించింది.
తనను పలు హోటళ్లకు, హుక్కా బార్లకు తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. దర్యాప్తు జరిపిన పోలీసులు 11 మంది గుర్తుతెలియని వ్యక్తులు, 12 మంది తెలిసిన వ్యక్తులపై కేసులు పెట్టారు. వారిలో ఆరుగురు పోలీసులకు చిక్కారు.




