Viral: టిప్‌టాప్‌గా విమానం దిగిన సార్.. కొంచెం తేడాగా కనిపించారు.. ఆపి చెక్ చేయగా
అది ఢిల్లీ విమానాశ్రయం. అప్పుడే బాగ్దాద్ నుంచి ఢిల్లీకి వచ్చింది ఓ విమానం. ప్రయాణీకులు అందరూ ఎగ్జిట్ ద్వారా లోపలికి వస్తున్నారు. పోలీసులు కూడా ప్రతీ ఒక్కరి బ్యాగ్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈలోగా ఓ వ్యక్తి బ్యాగ్ స్క్రీనింగ్‌లోకి వెళ్లగా.. కంప్యూటర్ స్క్రీన్‌పై అనుమానాస్పద చిత్రాలు కనిపించాయి. ఆ తర్వాత.!
ఢిల్లీ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇరాకీ జాతీయుడిని IGI విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. బాగ్దాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఇరాకీ జాతీయుడు అక్రమంగా 1203.00 గ్రాముల బరువు గల బంగారు, వస్తువులు ఆభరణాలను తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. టెర్మినల్ 3 వద్ద బయటకు వస్తున్న సమయంలో అతడి లగేజ్ ఎక్స్-రే స్క్రీనింగ్ చేయగా.. కంప్యూటర్‌లో అనుమానాస్పద చిత్రాలను కనిపెట్టారు పోలీసులు. ప్రయాణీకుడి తనిఖీలోనూ బలమైన బీప్ సౌండ్ రావడంతో అతని సామాన్లు క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు వివిధ రకాల పసుపు లోహం, వెండి పూతతో కూడిన ఆభరణాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాగా, సదరు వ్యక్తిపై కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..