Tauktae Cyclone: అతి భీకర తుపానుగా మారిన ‘తౌక్టే’.. అప్రమత్తమైన గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు..
Tauktae Cyclone: ఓవైపు కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలోనే తౌక్టే తుపాను దేశ పశ్చిమ తీర ప్రాంతాలను ఇబ్బందికి గురి చేస్తోంది. కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన...

Tauktae Cyclone: ఓవైపు కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలోనే తౌక్టే తుపాను దేశ పశ్చిమ తీర ప్రాంతాలను ఇబ్బందికి గురి చేస్తోంది. కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన ఈ తుపాను ప్రస్తుతం మరింత బలపడింది. దీంతో వాతావరణ శాఖ రాష్ట్రాలను హెచ్చరించింది. తౌక్టే అతి భీక తుపానుగా మారినట్లు ప్రకటించారు. ప్రస్తుతం గుజరాత్ వైపు పయనిస్తున్న తుపాను మంగళవారం ఉదయం నాటికి భావనగర్ జిల్లాలోని పోర్‌బందర్ – మహువా ప్రాంతం వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

Tauktae
ముంబయిలో ఆరెంజ్ అలర్ట్, అప్రమత్తమైన గుజరాత్ ప్రభుత్వం..
తుపాను కారణంగా సోమవారం అతిభారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలోనే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఉదయం కొంతసేపు వర్షం కురిసింది. దీంతో ముంబయి పశ్చిమ శివారుల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో విమాన రాకపోకలను నిలిపివేశారు. ఇదిలా ఉంటే తుపాను నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం సహాయక బృందాలను సిద్ధం చేసింది. తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడే అవకాశమున్నందున కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గుజరాత్ వెళ్లాయి. గుజరాత్ తీరంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రజలను కోరారు.
దేశ పశ్చిమ తీర ప్రాంతాలను వణికిస్తున్న తౌక్టే తుపాను..Watch Video
COVID Vaccine: హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో వృధాగా పోయిన 60 వేల కరోనా వ్యాక్సిన్లు.. ఎందుకంటే..