Tamil Nadu: మహిళ మెడలో నుంచి గోల్డ్‌ చైన్‌ లాక్కెళ్తుండగా ఓ చైన్‌ స్నాచర్‌‌ను కాల్చి చంపిన పోలీసులు

తమిళనాడులో రెచ్చిపోతోంది జార్ఖండ్‌ ముఠా. పెరంబదూర్‌లో ఓ మహిళ మెడలో నుంచి గోల్డ్‌ చైన్‌ లాక్కెళ్తుండగా అడ్డుకున్న స్థానికులు, పోలీసులపై..తుపాకులు,

Tamil Nadu: మహిళ మెడలో నుంచి గోల్డ్‌ చైన్‌ లాక్కెళ్తుండగా ఓ చైన్‌ స్నాచర్‌‌ను కాల్చి చంపిన పోలీసులు
Chain Snacher
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 12, 2021 | 8:26 PM

Chain Snacher – Tamil Nadu: తమిళనాడులో రెచ్చిపోతోంది జార్ఖండ్‌ ముఠా. పెరంబదూర్‌లో ఓ మహిళ మెడలో నుంచి గోల్డ్‌ చైన్‌ లాక్కెళ్తుండగా అడ్డుకున్న స్థానికులు, పోలీసులపై..తుపాకులు, కత్తులతో దాడి చేశారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ చైన్‌ స్నాచర్‌ హతమయ్యాడు. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. శ్రీపెరంబదూర్​లోని టోల్​ ప్లాజా వద్ద ఓ మహిళ మెడ నుంచి గొలుసును లాక్కెళ్తున్న జార్ఖండ్‌​కు చెందిన ముర్తాసాను కాల్చి చంపారు.

గత కొన్ని రోజులుగా చెన్నై, తిరువళ్లూర్‌, కాంచీపురం జిల్లాల్లో రెచ్చిపోతోంది చైన్‌ స్నాచింగ్‌ గ్యాంగ్‌. వరుసగా దోపిడీలకు పాల్పడుతోంది. తాజాగా పెరంబదూర్‌లో మహిళ మెడలో నుంచి గోల్డ్‌ చైన్‌ లాక్కెళ్తుండగా ఆమె గట్టిగా కేకలు వేయడంతో..స్థానికులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఐతే వారిపై కాల్పులకు తెగబడ్డాడు ఆ చైన్‌ స్నాచర్‌. సమచారమందుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా అటాక్‌ చేశాడు. తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముర్తాసా మృతి చెందాడు.

అయితే ఈ ఘటనలో ముర్తాసాకు మద్దతిచ్చిన మరో నిందితుడు నయీమ్​ అక్తర్​ను అరెస్ట్​ చేశారు పోలీసులు. మరోవైపు మూడు జిల్లాల్లో వరుస దోపిడీలను సీరియస్‌గా తీసుకున్న తమిళనాడు పోలీసులు..వారిపై నిఘా పెట్టారు. తెన్నలూర్‌ అటవీప్రాంతంలో చైన్‌ స్నాచర్స్‌ దాక్కున్నారన్న సమాచారంతో గాలింపు చేపట్టారు పోలీసులు. వారిని పట్టుకునే క్రమంలో..పోలీసులపై అటాక్‌ చేసింది చైన్‌ స్నాచింగ్‌ గ్యాంగ్. గన్‌తో కాల్పులు జరుపుతూ, కత్తులతో దాడికి దిగారు దుండగులు. దీంతో వారిపైకి కాల్పులు జరిపారు పోలీసులు.

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మరో ముగ్గురు దుండగులను అరెస్ట్‌ చేశారు.పోలీసుల సెర్చ్‌ ఆపరేషన్‌లో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఐతే మరికొందరు దుండగులు పరారీలో ఉన్నారన్న సమాచారంతో వారికోసం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు పోలీసులు.

Read also: AP CM Jagan Aasara: ఏపీలో ఆడపడుచులకు ఆసరా వారోత్సవాల పేరుతో మరో దసరా పండుగ తెచ్చిన జగన్ సర్కారు