Viral: రేవ్ పార్టీ జరుగుతోందంటూ పోలీసులకు ఫోన్.. అక్కడికెళ్లి చూడగా అంతకుమించిన సీన్ వెలుగులోకి..
ఇటీవల ఎంజాయిమెంట్ పేరుతో కొందరు వింత పోకడలకు పోతున్నారు. అలాంటి ఘటనే తాజాగా తమిళనాడులోని చెన్నై శివారులో చోటుచేసుకుంది. ఈ.సి.ఆర్‌లోని ఓ రిసార్ట్‌లో మహిళలు, పురుషులు కలిసి పార్టీ చేసుకుంటున్నారు. డీజే సౌండ్ ఎక్కువగా ఉండడంతో చుట్టుపక్కల ఉన్నవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

ఇటీవల ఎంజాయిమెంట్ పేరుతో కొందరు వింత పోకడలకు పోతున్నారు. అలాంటి ఘటనే తాజాగా తమిళనాడులోని చెన్నై శివారులో చోటుచేసుకుంది. ఈ.సి.ఆర్‌లోని ఓ రిసార్ట్‌లో మహిళలు, పురుషులు కలిసి పార్టీ చేసుకుంటున్నారు. డీజే సౌండ్ ఎక్కువగా ఉండడంతో చుట్టుపక్కల ఉన్నవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసుల ఎంట్రీతో అసలు విషయం బయటపడింది. అది రేవ్ పార్టీ కాదు స్వాప్ పార్టీ అని తేలడంతో పోలీసులే షాక్ అయ్యారు. ఇటీవల కాలంలో స్వాప్ పార్టీ కల్చర్ పెరిగిపోయింది. అసలు ఏంటి ఏ స్వాప్ పార్టీ అనేది ఇప్పటికీ చాలామందికి తెలియదు. స్వాప్ పార్టీ క్లబ్ పేరుతో ఆర్గనైజింగ్ సంస్థలు కూడా ఉన్నాయి. మెట్రోపాలిటన్ సిటీలో గత కొన్నేళ్లుగా ఒక కమ్యూనిటీలో ఉన్న కుటుంబాలు, పరిచయం ఉన్న కుటుంబాలు అకేషనల్‌గా కలిసినప్పుడు ఎంజాయ్మెంట్ పేరుతో ఒక ఆలోచన చేశారు. అదే ఒకరి భార్యను మరొకరు మార్చుకోవడం. ఆ రాత్రి వారితో కలిసి ఎంజాయ్ చేయడం. ఇది చాలా సందర్భాల్లో మహిళలు, పురుషులు ఇద్దరి అంగీకారంతో జరిగేవి. కొన్ని సందర్భాల్లో ఆ జంటల్లోని మహిళలకు ఇష్టం లేకుండా బలవంతంగా జరిగిన సందర్భాలు కూడా అనేకం. ఈ కల్చర్ రాను రానూ పెరిగిపోతోంది. ఇది ఒకప్పుడు పరస్పర అంగీకారంతో కొందరు చేసిన దారుణమైన చర్య అని చాలామంది తప్పుబడుతున్నారు.
కానీ ఇటీవల ఇలాంటి స్వాప్ పార్టీలను ఆర్గనైజింగ్ చేసేందుకు క్లబ్‌ల పేరుతో సంస్థలు పుట్టుకొచ్చాయి. చెన్నైలోని ఈ.సి.ఆర్ రోడ్డులో పన్నయోర్ ఓ రిసార్ట్ ను కొందరు రెండు రోజుల పాటు రిజర్వ్ చేసుకున్నారు. 8 మంది మహిళలు, 15 మంది పురుషులు రిసార్ట్‌కు వచ్చారు. 4 సాయంత్రం పెద్ద శబ్దాలతో అందరూ కలిసి డ్యాన్స్ చేస్తుండగా తమకు ఇబ్బందిగా ఉందని స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు. అది రేవ్ పార్టీగా పోలీసులకు ఫిర్యాదు అందింది. అక్కడకు చేరుకున్న నీలాంగరై పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. అక్కడనున్న వారి నుంచి వివరాలు సేకరిస్తుండగా షాకింగ్ విషయం బయట పడింది. అక్కడ జరుగుతున్నది కాక్ టైల్ పార్టీ కాదు.. స్వాప్ పార్టీ అని. మహిళలు, పురుషులను మార్చుకుని ఎంజాయ్ చేసేందుకే ఇక్కడకు వచ్చారని తేలింది.
కోయంబత్తూరు జిల్లాకు చెందిన సెంథిల్ కుమార్ ఈ స్వాప్ పార్టీ క్లబ్ ను నిర్వహిస్తున్నారని తెలిసింది. సెంథిల్ కుమార్ ద్వారానే వీళ్ళందరూ ఒకచోటకు చేరినట్లు తేలింది. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి వారిని సెంథిల్ కాంటాక్ట్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఇపుడు స్వాప్ పార్టీ పేరుతో కానీ ఒకప్పుడు..
పూర్వం ఒకటి రెండు చోట్ల రవికల పండుగ అనేది ప్రత్యేక దినాల్లో జరిగేదని పెద్దలు చెబుతుంటారు. ముందుగా సిద్ధపడ్డ కొందరు మహిళలు, పురుషులు ఒప్పందంతో ఓ చోట చేరుతారు. అక్కడ పెద్ద డ్రమ్ లాంటి వస్తువులో మహిళల రవికెలను అందులో వేస్తారు. ఆతర్వాత పురుషులు ఒక్కో రవికెను తీస్తారు.. ఆ రవిక ఎవరిది అయితే వారు ఆమహిళతో ఆ పూట కలిసి ఉంటారు. ఇది పూర్వం జరిగినట్లు పుస్తకాల్లో ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




