Tamil Nadu Elections: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎన్నికల వేళ ఒక్కటైన ప్రముఖ నటులు..

Tamil Nadu Elections: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన..

Tamil Nadu Elections: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎన్నికల వేళ ఒక్కటైన ప్రముఖ నటులు..
Follow us

|

Updated on: Feb 27, 2021 | 3:36 PM

Tamil Nadu Elections: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తదరిమిలా రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. గెలుపే లక్ష్యంగా పొత్తులు, కూటముల ఏర్పాటుకు సంబంధించి చర్చలను ముమ్మరం చేశాయి. ఈ అంశంలో మక్కల్ నీదిమయ్యం అధినేత కమల్ హాసన్ ముందున్నారని చెప్పాలి. తాజాగా సీనియర్ నటుడు, ఆలిండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే) అధినేత శరత్ కుమార్, కమల్ హాసన్ భేటీ అయ్యారు. మూడో కూటమి ఏర్పాటుపై కీలక చర్చలు జరిపారు. దాంతోపాటు పొత్తులపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఇరువు నేతలు.. కీలక విషయాలు వెల్లడించారు.

తమిళనాడులో మూడో కూటమి ఏర్పాటు చేస్తున్నామని కమల్ హాసన్ ప్రకటించారు. మూడో కూటమి ముఖ్యమంత్రిని అభ్యర్థిని తానేని స్పష్టం చేశారు. శరత్ కుమార్ తనతో కలిసి రావడం శుభపరిణామం అన్న కమల్ హాసన్.. తమతో కలిసేందుకు ఏ పార్టీ అయినా ముందుకు రావొచ్చునని ప్రకటించారు.

దీనికి ముందు మీడియాతో మాట్లాడిన శరత్ కుమార్.. అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీదిమయ్యంతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని కమల్‌కు చెప్పినట్లు తెలిపారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇప్పటికే ఇండియా జననాయగ కట్చి పార్టీతో తమ పొత్తు ఖరారైందని శరత్ కుమార్ తెలిపారు. ఇప్పుడు మక్కల్ నీదిమయ్యంతో పొత్తు కూడా ఖరారు కావడంతో ప్రస్తుతం మూడు పార్టీల కూటమిగా ఉన్నాయి. ఇదిలాఉంటే.. శరత్ కుమార్ పార్టీ ఇప్పటి వరకు అన్నాడీఎంకే మిత్రపక్షంగా ఉండేది. తాజాగా మక్కల్ నీదిమయ్యం పార్టీతో పొత్తు ఖరారు కావడంతో అధికార పార్టీతో వీడిపోయినట్లయింది.

Also read:

పోటీ చేశానని నన్ను, నా కుటుంబాన్ని వెలి వేశారు.. అచ్చెన్నాయుడిపై సోదరుడి కుమారుడు సంచలన ఆరోపణలు

తనను మోసం చేస్తోన్న బాయ్‌ఫ్రెండ్‌కి ఈ అమ్మాయి ఎలా బుద్ధి చెప్పిందో చూడండి.. వైరల్‌గా మారిన వీడియో..

కేజీఎఫ్ యష్ కు ఎన్ని కార్లు ఉన్నాయో తెలిసా.. చుస్తే షాక్ అవుతారు