Liquor: వాక్సిన్ వేసుకున్న వారికే మద్యం… లబోదిబోమంటున్న మందుబాబులు
కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఇప్పడికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో ఎందరో ఆప్తుల్ని కోల్పోయాం.
కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఇప్పడికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో ఎందరో ఆప్తుల్ని కోల్పోయాం. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వ్యాక్సిన్స్ వచ్చినప్పటికీ కూడా రెండు డోస్‌లు వేసుకున్నవారు కూడా చాలామంది వైరస్ బారినపడ్డారు. అయితే వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటే.. ప్రమాద తీవ్రత తక్కువ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఓవైపు నిబంధనలు కొనసాగిస్తూనే.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు సర్కార్ వ్యాక్సినేషన్‌పై భారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరోవైపు వ్యాక్సిన్ వేసుకుంటే బహుమతులు కూడా ఇస్తుంది. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్స్ చేపడుతోంది. ఈ క్రమంలో మైలాడుతురై జిల్లా అధికార యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం నియంత్రణలో ఉన్న టాస్మాగ్ దుకాణాలలో మద్యం కొనుగోలు చేసేవారు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపెట్టాలనే నిబంధన పెట్టింది. ప్రజలు ఈ ప్రక్రియకు పూర్తి సహకారం అందించాలని.. కోవిడ్-19 రహిత జిల్లాగా మార్చేందుకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ ప్రకటనలో అక్కడి మద్యం ప్రియులు టెన్షన్ పడుతున్నారు. కొందరు వ్యాక్సిన్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.
కాగా ఈ ఆలోచన చాలా బాగుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మిగిలిన జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ దిశగా ఆలోచన చేయాలని కోరుతున్నారు. కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితులు ఉన్నందున వ్యాక్సిన్ వేసుకుంటునే భద్రత ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
Also Read: పండుగ తర్వాత భారీ విద్యుత్ కోతలంటూ ఏపీలో ప్రచారం.. ఇందన శాఖ క్లారిటీ
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన.. రాబోయే 3 రోజులు ఇలా