MK Stalin: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐదు ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చిన స్టాలిన్..మొదటి సంతకం దాని కోసమే!

Tamil Nadu Cm Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కొద్ది నిమిషాలలోనే ఎంకే స్టాలిన్ ఐదు ముఖ్యమైన ఉత్తర్వులపై సంతకం చేశారు.

MK Stalin: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐదు ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చిన స్టాలిన్..మొదటి సంతకం దాని కోసమే!
Tamil Nadu Cm Stalin
Follow us

|

Updated on: May 07, 2021 | 2:50 PM

MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కొద్ది నిమిషాలలోనే ఎంకే స్టాలిన్ ఐదు ముఖ్యమైన ఉత్తర్వులపై సంతకం చేశారు, ఇందులో కుటుంబాలకు ఆర్థిక సహాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే, పాల ధరల తగ్గింపు, కరోనా ఆర్ధిక సహాయం నాలుగు వేల రూపాయలు ఉన్నాయి. ఈ ఉత్తర్వులలో కొన్ని అసెంబ్లీ ఎన్నికలకోసం డీఎంకే విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల ఆధారంగా ఉన్నాయి. ఎంకే స్టాలిన్, ఆయన మంత్రి వర్గ సహచరులతో శుక్రవారం చెన్నైలోని రాజ్ భవన్‌లో గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారంచేయించారు. కరోనావైరస్ మహమ్మారి కింద ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కల్పించడానికి ఎంకే స్టాలిన్ ఐదు ఉత్తర్వులపై సంతకం చేశారు.

శుక్రవారం స్టాలిన్ సంతకం చేసిన మొత్తం ఐదు ఆదేశాలు ఇవే..

  • మహమ్మారి మధ్య కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నంలో రాష్ట్రంలోని అన్ని ‘రైస్’ రేషన్ కార్డుదారులకు వెంటనే 4,000 రూపాయలు అందించనున్నారు. రూ .4 వేలలో, మే నెలలో రూ .2,000 పంపిణీ చేయస్తారు. మిగిలినవి తరువాత ఇస్తారు.
  • డీఎంకే తన మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా, నివాసితులకు ఉపశమన చర్యగా ఆవిన్ పాలు ధరను రూ .3 తగ్గిస్తారు.
  • పనిచేసే నిపుణులు అలాగే, విద్యార్థులతో సహా మహిళలందరూ శనివారం నుంచి ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సులలో (సాధారణ ఛార్జీలు) ఉచితంగా ప్రయాణించవచ్చు. దీనివల్ల కలిగే 1,200 కోట్ల రూపాయల అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
  • డీఎంకే ప్రభుత్వం మొదటి 100 రోజుల్లో మీ ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కొత్త విభాగం ఏర్పడుతుంది.
  • ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్ చికిత్స కోసం అయ్యే ఖర్చులు ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి వస్తాయి అలాగే ఆ సొమ్ము ప్రభుత్వ ఆసుపత్రులకు తిరిగి చెల్లిస్తారు.

కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానాలు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చాయి.

Also Read: ప్లాస్మా దానం నిజంగా కొవిడ్‌ను నయం చేస్తుందా..? ప్లాస్మాను ఎప్పుడు, ఎలా దానం చేయాలో తెలుసుకోండి..

Work from Home: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై ఇంటి నుంచి విధులు నిర్వహించేందుకు కేంద్రం అనుమతి

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే