ప్రమాదమని హెచ్చరించినా.. కొండపైకి వెళ్లిన మహిళ.. చివరకు జరిగింది ఇదే..!
తమిళనాడులోని తిరువన్నామలై క్షేత్రం మహా దీపోత్సవం కనులారా చూడాలని తపించింది. ప్రమాదం అని తెలిసినా దేవుడిపై ఉన్న భక్తి ఆమెను కొండపైకి తీసుకెళ్లింది. చివరకి దారి తప్పి రెండు రోజుల పాటు చిమ్మ చీకట్లో నరక అనుభవించింది. చివరికి అటవీ అధికారుల చొరవతో క్షేమంగా బయటపడింది.
తమిళనాడులోని తిరువన్నామలై క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మహా దీపోత్సవం ఘనంగా జరుగుతోంది. దీపోత్సవాన్ని తిలకించేందుకు అశేష భక్తులు విచ్చేస్తుంటారు. తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర ఆలయాన్ని దర్శించుకుని కార్తీక పౌర్ణమి డిసెంబర్ నెలలో జరిగే ఈ కార్యక్రమానికి ఆలయం ఆనుకుని ఉన్న కొండపై దీపోత్సవం జరుగుతోంది. దాదాపు 11 రోజుల పాటు వెలిగే ఈ మహాదీపాన్ని స్థానికులతోపాటు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు.
పంచభూతాళాలలో అగ్నితలంగా ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలై అరుణాచలేశ్వరర్ – నిట్టమలైయమ్మన్ ఆలయంలో కార్తీక మాస దీపోత్సవం చాలా విశిష్టంగా జరుపుకుంటారు. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ముగింపుగా మహాకార్తీక నాడు ఆలయం వెనుకవైపు ఉన్న 2668 అడుగుల ఎత్తైన దీప కొండపై మహాదీపం వెలిగించడం సాప్రదాయంగా వస్తోంది. ఈ దీపోత్సవాన్ని దగ్గర నుండి తిలకించేందుకు ముందుగా అనుమతించిన పరిమిత సంఖ్యలో భక్తులకు అవకాశం ఉంటుంది. ప్రత్యేక 2,500 మంది వరకు మాత్రమే అనుమతించి ముందుగా టోకెన్లు జారీ చేస్తారు.
ఇటీవల తమిళనాడులో తుఫాను ప్రభావంతో తిరువన్నామలైలో భారీ వర్షాల కారణంగా ఆలయం సమీపంలోని కొండపై కొండ చర్యలు విరిగిపడడంతో ఏడుగురు చనిపోయారు. ప్రస్తుతం తమిళనాడులో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎప్పటిలాగా ఈసారి భక్తులను కార్తీక దీపోత్సవం జరిగే ప్రాంతానికి అనుమతించడం క్షేమం కాదని నిపుణుల సలహా మేరకు ఆలయ అధికారులు ఈసారి భక్తులకు ప్రవేశాన్ని నిషేధించారు. భక్తులు ఎవరూ దీపామలై ఎక్కకుండా పోలీసులు, అటవీశాఖ అధికారులు బందోబస్తులో ఏర్పాటు చేశారు. అయితే ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ, డిసెంబర్ 15న మహాదీపం చూసేందుకు ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళ, ఒక పురుషుడు పర్వతాన్ని అధిరోహించారు.
తిరువన్నామలై వెళ్ళిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు దీపోత్సవం జరిగే ప్రాంతానికి వెళ్లాలని బయలుదేరారు. అయితే ఇటీవల భారీ వర్షాలు కొండ చరియలు విరిగిపడ్డ కారణంగా దీపోత్సవం జరిగే ప్రాంతానికి వెళ్లలేక పోయారు. దారి తప్పి ఒక రోజంతా అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరిగిరాలేక రాత్రంతా అక్కడే ఉండిపోయారు. వెళ్లిన ఇద్దరిలో ఒక వ్యక్తి మాత్రం ఎలాగోలా మరుసటి రోజు తిరిగి తిరువన్నామలై చేరుకోగలిగారు. మహిళా భక్తురాలు మార్గం తెలియక ఇరుక్కుపోయింది. దీంతో ఆ వ్యక్తి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు.
కొండపైనే ఆ మహిళ చిక్కుకున్న విషయాన్ని స్థానిక అధికారులకు తెలియజేయడంతో.. స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో కొండపైకి వెళ్లి ఆ మహిళను అక్కడి నుంచి కాపాడి క్షేమంగా తీసుకురాగలిగారు. సుమారు 6 గంటల పాటు శ్రమించిన తర్వాత ఆ మహిళ దక్షిణ దిశలో మహాదీప కొండకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. 40 గంటల పైగా కొండపైనే చిమ్మ చీకట్లో నరకం చూసిన ఆ మహిళ తిండి తిప్పలు లేకపోవడంతో నీరసంతో అడుగు పెట్టలేని పరిస్థితి. దీంతో మహిళను కాపాడేందుకు వెళ్లిన ఫారెస్ట్ రేంజర్ రమేష్ ఆమెను మోసుకొని కొండపై నుంచి కిందకు తీసుకువచ్చారు. బాగా అలసిపోయిన మహిళను తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు.
వీడియో చూడండి…
అధికారుల విచారణలో ఆమెను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ప్రాంతానికి చెందిన అన్నపూర్ణగా గుర్తించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి దీపామలై ఎలా అధిరోహించారో ఆరా తీస్తున్న అటవీ అధికారులు ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. కొండపైకి వెళ్లిన ఆ సమయంలో భారీ వర్షపాతం నమోదైన గాలుల ప్రభావం ఉన్న పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అందోళన వ్యక్తం చేశారు. భక్తులు ఎవరు నిషేధం ఉన్న ప్రాంతాలకు ఎలా వెళ్లడం మంచిది కాదని ఆలయ అధికారులు హెచ్చరించారు.
Source..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..