Watch: సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన.! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే..
మనం సాధారణంగా గుడికి వెళ్లాలనుకుంటే ఎలా వెళ్తాం. దగ్గరలో ఉన్న ఆలయానికి అయితే నడుచుకుంటూ వెళతాం.. లేదా కొంచెం దూరం ఉన్నట్లయితే ఏదైనా వాహనం మీద వెళ్లి దర్శనం చేసుకుని వస్తాం. కానీ, ఇక్కడ ఒక భక్తుడు మాత్రం ఏకంగా హెలికాప్టర్‌లో వచ్చారు. రావడమే కాదు.. ఆ హెలికాప్టర్‌కు పూజలు కూడా చేశారు. ఇది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
గుజరాత్ రాష్ట్రంలోని బొటాద్ ప్రాంతంలో ప్రసిద్ధ సాలంగాపూర్ హనుమాన్ దేవాలయం ఉంది. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఆలయానికి పెద్ద ఎత్తున వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ ఉన్న ఆంజనేయస్వామి ఎంతో మహిమాన్వితమైన శక్తి కలవాడని భక్తులు నమ్ముతారు. అలాంటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయాన్ని ఓ వ్యాపారవేత్త హెలికాప్టర్‌లో వచ్చి సందర్శించారు. హెలికాప్టర్ కోసం నిర్దేశించిన ప్రాంతంలో ఆపి, అక్కడే హెలికాప్టర్‌కు పూజలు చేశారు. కాషాయ వస్త్రాలు ధరించిన ఇద్దరు సన్యాసులు ఆలయం నుంచి వచ్చి పూజలు చేశారు. అందులో ఒక సన్యాసి బొట్టు పెట్టి హెలికాప్టర్ మీద పూలు చల్లి భక్తిగా మొక్కుకున్నారు. కొత్తగా హెలికాప్టర్ కొనడంతో అంతా బాగుండాలనే ఉద్దేశ్యంతో సాలంగాపూర్ హనుమాన్ మందిరం వద్దకు వచ్చి ఆ భక్తుడు పూజలు చేసినట్లు తెలుస్తోంది. కానీ, ఓ భక్తుడు పూజ కోసం ఇలా హెలికాప్టర్‌లో రావడం, కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులు పూజలు చేయడం అక్కడి చూపరులను ఆకర్షించింది. పూజలు చేసిన అనంతరం అతడు మళ్లీ అదే హెలికాప్టర్‌లో తిరిగి వెళ్లిపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?

