Tahawwur Rana: అమెరికా నుంచి భారత్‌కు లష్కర్ ఉగ్రవాది తహవూర్ రాణా.. నెక్స్ట్ ఏంటంటే..
26/11 ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రాణాను NIA అధికారులు భారత్‌కు తీసుకొచ్చారు. అమెరికా నుంచి వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయ్యింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో రాణాను భారత ప్రభుత్వ జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయానికి తరలించారు. SWAT కమెండో బృందం సెక్యూరిటీని పర్యవేక్షిస్తోంది. రాణాను పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరుస్తారు.

26/11 ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రాణాను NIA అధికారులు భారత్‌కు తీసుకొచ్చారు. అమెరికా నుంచి వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయ్యింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో రాణాను భారత ప్రభుత్వ జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయానికి తరలించారు. SWAT కమెండో బృందం సెక్యూరిటీని పర్యవేక్షిస్తోంది. రాణాను పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరుస్తారు. విచారణ కోసం రాణాను NIA కస్టడీ కోరే అవకాశముంది. తహవూరు రాణా విచారణ కోసం ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. NIA ఆఫీస్ దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బీఎస్ఎఫ్ బలగాలతో ఎన్ఐఏ ఆఫీస్ దగ్గర భద్రతను ఏర్పాటు చేశారు.
రాణాను ఎలా విచారించాలన్న విషయంపై NIA అధికారులు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా.. తహవూర్ రాణాను అమెరికా అధికారులు NIAకు అప్పగించారు. ఢిల్లీ NIA కార్యాలయంలో రాణా విచారణ కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. 12 మంది అధికారులు రాణాను విచారించబోతున్నారు. మరోవైపు రాణాను భారత్‌కు రప్పించడంపై నాటి సైనికులు హర్షం వ్యక్తం చేశారు.. ముంబై దాడుల సమయంలో కౌంటర్ ఆపరేషన్లో పాల్గొన్నారు NSG కమెండో సురేంద్ర సింగ్. ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు కూడా. రాణాను వెంటనే ఉరితీయాలని సురేంద్ర డిమాండ్ చేశారు.
వీడియో చూడండి..
తహవూర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి ఆరోపణలున్నాయి. లాస్ ఏంజెలెస్ జైల్లో వున్న అతన్ని తమకు అప్పగించాలని భారత్ కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. తనను భారత్‌కు అప్పగించ వద్దంటూ ఫెడరల్ కోర్టులతోపాటు శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్ కోర్టును సైతం ఆశ్రయించాడు రాణా. కానీ న్యాయస్థానాల్లో అతడికి చుక్కెదురైంది. ఎట్టకేలకు అతన్ని భారత్‌కు అప్పగించారు. ముంబై పేలుళ్ల మాస్టర్‌మైండ్‌గా భావిస్తోన్న పాకిస్థాన్-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో రాణాకు సంబంధాలున్నాయని ఎన్‌ఐఏ ఇప్పటికే గుర్తించింది. 26/11 దాడికి ముందు హెడ్లీ ఎనిమిది సార్లు భారత్‌లో పర్యటించారు. ఆ టైమ్‌లో రాణా-హెడ్లీ మధ్య 231 సార్లు సంప్రదింపులు జరిపినట్టు ఎన్‌ఐఏ పేర్కొంది. ముంబైలో 26/11 ఉగ్రవాద దాడుల్లో అరెస్టు అయిన దాదాపు 16 సంవత్సరాల తర్వాత, రాణా భారతదేశానికి తిరిగి రావడానికి మార్గం సుగమం అయింది. దీంతో అతడి నుంచి మరిన్ని వివరాలను సేకరించేందుకు అధికారులు విచారణ చేపట్టనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




