పంబన్ రైల్వే బ్రిడ్జ్.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్
పంబన్ రైల్వే బ్రిడ్జ్...దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఇది తమిళనాడు ప్రధాన భూ భాగాన్ని రామేశ్వరం ద్వీపంతో కలిపే రైల్వే బ్రిడ్జి. నౌకలు వచ్చినప్పుడు వాటికి దారి ఇచ్చేలా ఈ బ్రిడ్జిని నిర్మించారు. అయితే పాత వంతెన కట్టి వందేళ్లు దాటిపోవడం, దీని జీవితకాలం దాదాపు ముగియడంతో పంబన్‌లో కొత్త రైల్వే బ్రిడ్జిని నిర్మించారు.
పంబన్ పాత రైల్వే బ్రిడ్జి.. నౌకలు వచ్చినప్పుడు, రెండు భాగాలుగా ఓపెన్ అయి ఓడలకు దారి ఇస్తుంది. అయితే ఈ కొత్త రైల్వే బ్రిడ్జి మాత్రం… నౌకలు వచ్చినప్పుడు…లిఫ్ట్ లాగా పైకి వెళుతుంది. శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12.45గంటలకు ప్రధాని మోదీ పంబన్ నుంచి రిమోట్ నొక్కి వంతెనను ప్రారంభించారు. ఆ తర్వాత రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీసింది. అనంతరం ఓ కోస్ట్ గార్డ్ షిప్ తొలిసారి కొత్త బ్రిడ్జి కింద నుంచి వెళ్లింది. రామేశ్వరం ద్వీపంలోని ఈ పంబన్ ప్రాంతానికి, రామాయణ ఇతిహాసంతో కూడా సంబంధం ఉంది. రామేశ్వరంలోని ధనుష్కోటి నుంచి వానరుల సాయంతో శ్రీరాముడు రామసేతును నిర్మించాడని రామాయణం చెబుతోంది. అలా మన సాంస్కృతిక వారసత్వానికి కూడా పంబన్ వంతెన ఓ వారధిలా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్.. ఒక్కసారిగా
బట్టతలపై జుట్టు మొలిపిస్తామని మందురాసారు..చివరికి ఇలా…!
అత్తను ఈడ్చి ఈడ్చి కొట్టిన కోడలు.. ఏం జరిగిందంటే..!

గోల్డ్ వద్దు.. సిల్వర్ ముద్దు.. బంగారం కంటే వెండే బెటర్ ఎందుకంటే?

కన్నకొడుకునే దారుణంగా హత్య చేసిన తండ్రి వీడియో

లెక్చరర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే వీడియో

ఏఐతో నిరుద్యోగ సునామీ..వారి కామెంట్స్ వైరల్ వీడియో

టేకాఫ్ సమయంలో విమానంలో చెలరేగిన మంటలు వీడియో

బ్రిటన్‌లో మిరాకిల్.. రెండు సార్లు జన్మించిన పిల్లాడు వీడియో

ఏపీలో సీతమ్ము ప్రత్యేక ఆలయం ఉందని తెలుసా? వీడియో
