చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్.. ఒక్కసారిగా
వేసవి కాలం వచ్చిందంటే గ్రామాల్లోని చెరువులు గుంటలను ఆశ్రయిస్తారు. వాటిలో ఈత కొడుతూ వేసవి తాపంనుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాదు స్విమ్మింగ్ ఇష్టపడేవారు ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. ఒక్కోసారి ప్రమాదాల్లో కూడా పడుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. చెరువులో ఈతకొట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది.
అతను ఊహించని విధంగా చెరువులో భారీ మొసలి కనిపించడంతో దెబ్బకు అక్కడినుంచి భయంతో పారిపోయాడు. నీటితో నిండి ఉన్న ఓ చెరువు వద్దకు ఓ వ్యక్తి వెళ్లాడు. చెరువులోని నీరు ఎండపడి మెరుస్తూ కనిపిస్తోంది. పైన ఎండ… పక్కనే చెరువులో చల్లని నీళ్లు.. అతనికి చెరువులో ఈతకొట్టాలనిపించింది. వెంటనే చెరువులోకి దిగడానికి రెడీ అయ్యాడు. మళ్లీ ఎందుకో ఆలోచించి కాసేపు గట్టుపైనే కూర్చుని నీళ్లను చూస్తూ ఉన్నాడు. పక్కనే ఓ రాయి కనిపించడంతో దానిని నీటిలోకి విసిరాడు. రాయి నీళ్లలో పడగానే.. లోపలి నుంచి ఓ పెద్ద మొసలి అమాంతం పైకి లేచి నోరు తెరిచింది. అప్పటికదాకా నీళ్లను చూస్తూ ఎంజాయ్ చేసిన ఆ వ్యక్తి ఊహించని పరిణామానికి షాకయ్యాడు. దెబ్బకు అక్కడినుంచి దూరంగా వచ్చేశాడు. నీళ్లే కదా అని పొరపాటున అందులోకి దిగి ఉంటే.. నాపని గోవిందా… అమ్మబాబోయ్.. అనుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను దాదాపు 2 మిలియన్లమందికి పైగా వీక్షించారు. 9 వేలమంది లైక్ చేశారు. వామ్మో ఈ మొసలి తెలివి మామూలుగా లేదుగా అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బట్టతలపై జుట్టు మొలిపిస్తామని మందురాసారు..చివరికి ఇలా…!
అత్తను ఈడ్చి ఈడ్చి కొట్టిన కోడలు.. ఏం జరిగిందంటే..!
మీరు మెనోపాజ్ స్టేజ్‌లో ఉన్నారా.. ఇది మీ కోసమే!
ఎగిరే ఉడుత కనిపించిందోచ్.. అంతరించిపోయింది అనుకుంటే..
ICUలో అలేఖ్య చిట్టి.. కన్నీళ్లతో వేడుకుంటూ అక్కాచెల్లి వీడియో

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో

అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో

కారుల్లో వస్తారు.. రెక్కీ నిర్వహిస్తారు ఆ తర్వాత వీడియో

యువకుడి ఐడియా అదుర్స్.. ఏసీ కూడా పనికి రాదు వీడియో
