Swiss Bank: డబ్బే.. డబ్బు..! భారత్‌ చేతికి స్విస్‌ బ్యాంక్ ఖాతాల నాలుగో జాబితా.. ఏడాదిలో ఎన్ని అకౌంట్లు పెరిగాయంటే..?

2019 నుంచి అందిస్తున్న ఈ జాబితాలో అకౌంట్ల, ఖాతాదారుల వివరాలను బహిరంగంగా వెల్లడించడకుండా.. స్విట్జర్లాండ్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఆయా దేశాల ప్రభుత్వాలకు ఏటా అక్టోబర్‌లో స్విస్‌ బ్యాంక్‌ పూర్తి వివరాలను అందజేస్తోంది.

Swiss Bank: డబ్బే.. డబ్బు..! భారత్‌ చేతికి స్విస్‌ బ్యాంక్ ఖాతాల నాలుగో జాబితా.. ఏడాదిలో ఎన్ని అకౌంట్లు పెరిగాయంటే..?
Swiss Bank Details
Follow us

|

Updated on: Oct 11, 2022 | 5:12 PM

స్విస్‌ బ్యాంకుల్లో భారతీయ పౌరులు/సంస్థలకు చెందిన అకౌంట్ల వివరాలతో కూడిన నాలుగో జాబితా భారత్‌కు చేరింది. అందులో వ్యాపారస్థులతోపాటు కార్పొరేట్‌లు, ట్రస్టులకు చెందిన వందల అకౌంట్ల వివరాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. స్విట్జర్లాండ్‌తో కుదుర్చుకున్న సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా బ్యాంకు అకౌంట్లకు సంబంధించి తాజా జాబితాను అందించింది. 2019 నుంచి అందిస్తున్న ఈ జాబితాలో అకౌంట్ల, ఖాతాదారుల వివరాలను బహిరంగంగా వెల్లడించడకుండా.. స్విట్జర్లాండ్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఆయా దేశాల ప్రభుత్వాలకు ఏటా అక్టోబర్‌లో స్విస్‌ బ్యాంక్‌ పూర్తి వివరాలను అందజేస్తోంది. 2019, 2020 లో 86 దేశాలకు చెందిన దాదాపు 30-31 లక్షల అకౌంట్ల వివరాలను వెల్లడించగా, 2021లో 96 దేశాలకు చెందిన వారి 33 లక్షల అకౌంట్ల వివరాల అందజేత. తాజాగా 101 దేశాలకు చెందిన 34 లక్షల అకౌంట్ల వివరాలు. భారత్‌కు అందిన సమాచారం ఆధారంగా పన్ను చెల్లింపుదారులు తమ టాక్స్‌ రిటర్నులలో ఆర్థిక ఖాతాల వివరాలను సరిగ్గా ప్రకటించారా లేదా అన్నది పన్ను శాఖ అధికారులు ధ్రువీకరించుకోనున్నారు

అటోమేటిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఎక్ఛేంజ్‌లో భాగంగా ప్రతిఏటా ఈ జాబితా స్విట్జర్లాండ్‌ అందిస్తుండగా.. తాజాగా 101 దేశాలకు చెందిన 34లక్షల అకౌంట్ల వివరాలను విడుదల చేసింది. ఈ జాబితాలో కొత్తగా నైజీరియా, పెరూ, టర్కీ, అల్బేనియా, బ్రూనీ వంటి దేశాలు చేరినట్లు ఫెడరల్‌ టాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది. దీంతో గతేడాదితో పోల్చితే వివిధ దేశాలకు చెందినవి కలిపి దాదాపు లక్ష అకౌంట్లు పెరిగినట్లు తెలిపింది. అయితే, 101 దేశాల పేర్లు, వాటి అకౌంట్ల వివరాలను బహిరంగంగా చెప్పనప్పటికీ ఆ జాబితాలో భారత్‌ ఉందని ఎఫ్‌టీఏ వెల్లడించింది. ఈ వివరాలను ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే భారత ప్రభుత్వానికి అందించినట్లు వెల్లడించింది.

ఏఈఓఐలో భాగంగా స్విట్జర్లాండ్‌లో మన దేశస్థుల అకౌంట్ల వివరాలతో కూడిన తొలి జాబితా 2019లో కేంద్ర ప్రభుత్వానికి అందింది. ఆ ఏడాది మొత్తం 75 దేశాలకు చెందిన అకౌంట్ల జాబితాను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం 2020 సెప్టెంబర్‌లో రెండో జాబితా, 2021 మూడో జాబితాలో 86 దేశాల వివరాలను వెల్లడించింది. ఐడీ, పేరు, అడ్రస్‌, నివాస దేశం, టాక్స్‌ ఐడీ, సంస్థకు చెందిన వివరాలు, అకౌంట్లో నగదు, మూలధనం వంటి పూర్తి అకౌంట్‌ వివరాలు.. ఆయా ప్రభుత్వాలకు అందించిన నివేదికలో ఉంటాయని ఎఫ్‌టీఏ తెలిపింది. అయితే, 2018 ఆ తర్వాత క్రియాశీలంగా ఉన్న అకౌంట్ల వివరాలు మాత్రమే ఎఫ్‌టీఏ వెల్లడిస్తోంది.

ఇవి కూడా చదవండి

స్విస్‌ బ్యాంకులో భారీగా పెరిగిన భారతీయుల సంపద..

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు భారీగా పెరుగుతున్నాయి. స్విస్ నేషనల్ బ్యాంక్‌లో ఇండియన్ ఫండ్స్ రెండేళ్లుగా భారీగాపెరుగుతున్నట్లు నివేదికలో వెల్లడించింది. 2022, జూన్‌లో విడుదలైన స్విస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ గణాంకాల ప్రకారం.. 2021 చివరి నాటికి ఇండియన్ ఫండ్స్ మొత్తం 3.8 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌ పైకి చేరాయి. కాగా, స్విస్ బ్యాంక్‌లో ఫారిన్ క్లయింట్స్ ఫండ్స్ పరంగా చూస్తే భారత్ 44వ స్థానంలో ఉంది. యూకే టాప్‌లో కొనసాగుతోంది.

కరోనా కాలంలోనూ స్విస్‌ బ్యాంకులలో పెరుగుతూనే ఉన్న భారత కుబేరుల సంపద

2019తో పోల్చితే 2020లో భారతీయుల సంపద మూడు రెట్లు పెరిగింది. 2019 చివరికి 6,625 కోట్లు ఉన్న సంపద 2020 చివరికి 20,700 కోట్లకు చేరడం విశేషం. తాజాగా ఈ డిపాజిట్లు 2021 చివరికి 30,500 కోట్లకు (3.83 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లు) చేరాయి. అంటే గతేడాది 50 శాతం పెరుగుదల నమోదైంది

స్విస్‌ బ్యాంకుల్లో భారతీయలు, భారత కంపెనీల సంపద.. ఇలా

  • 2019 ముగిసే నాటికి ఈ విలువ 899 మిలియన్ల స్విస్‌ ఫ్రాంక్స్‌ (దాదాపు రూ.6,625 కోట్లు)
  • 2020 చివరి నాటికి 2.55 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌కు (దాదాపు రూ.20,700 కోట్లు) చేరింది
  • 2021 చివరికి 3.83 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌కు (దాదాపు రూ.30,500 కోట్లు)
  • ఇది 14 సంవత్సరాల గరిష్ట స్థాయి.. సెక్యూరిటీలు, వాటికి సమాంతర సాధనాలు సహా కస్టమర్ల డిపాజిట్ల మూలంగా సంపదలో పెరుగుదల

16 ఏళ్ల క్రితం..

  • 2006 నాటికి స్విస్‌ బ్యాంకుల్లో రికార్డు స్థాయిలో భారతీయులు, భారత కంపెనీల నిధులు
  • 2006 నాటికి స్విస్‌ బ్యాంకుల్లో 6.5 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌ భారత సంపద
  • అంటే మన రూపాయలలో 52 వేల కోట్లకు పైమాటే. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం

అప్పటినుంచి తగ్గుతూ వస్తున్న డిపాజిట్లు

  • 2011, 2013, 2017, 2020 సంవత్సరాలలో మాత్రం స్వల్పంగా పెరిగిన డిపాజిట్లు
  • ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని ప్రకటించింది.
  • ఆ తరువాత మరింత తగ్గిన స్విస్ బ్యాంక్‌లో నగదు నిల్వలు
  • ఒక్క 2017 సంవత్సరంలోనే 44 శాతం తగ్గాయి.
  • 2018లో 11 శాతం తగ్గాయి.
  • 2019లో కస్టమర్‌ అకౌంట్‌ డిపాజిట్లు 550 మిలియన్‌ ఫ్రాంక్స్‌ ఉన్నాయి.
  • 2020లో 503.9 మిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌ కు తగ్గాయి.. అంటే.. 4,442 కోట్ల నుంచి 4,000 కోట్లకు తగ్గాయి

స్విస్‌ బ్యాంకు అంటే ఒక బ్యాంకే కాదు..

2020 చివరినాటికి స్విట్జర్లాండ్‌లో 243 బ్యాంకులు పనిచేస్తున్నాయి. స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అజమాయిషీలో ఇవి పనిచేస్తాయి. ప్రస్తుత మారకం రేటు ప్రకారం 1 అమెరికన్‌ డాలర్‌ = 1.00 స్విస్‌ ఫ్రాంక్స్‌ కు సమానంగా ఉంది. 1 స్విస్‌ ఫ్రాంక్స్‌ = 82.43 భారత రూపాయలు.. స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు ఉంచిన నిధులను నల్లధనంగా పరిగణించని స్విట్జర్లాండ్‌ దేశం. పన్ను ఎగవేతలు, అక్రమ ధనార్జన వంటి కేసుల విషయంలో విచారణకు భారత్‌కు సహకారం ఇస్తామని వెల్లడించింది. దీని ప్రకారం.. తమ దేశంలో భారతీయుల అకౌంట్ల సమాచారాన్ని 2019 సెప్టెంబర్‌లో స్విట్జర్లాండ్‌ మొట్టమొదటిసారి భారత్‌కు అందజేసింది.

తొలి రెండు స్థానాల్లో బ్రిటన్, అమెరికా..

  • అన్ని స్విస్‌ బ్యాంకుల్లో కస్టమర్ల డిపాజిట్లు 2020లో దాదాపు 2 ట్రిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌లకు చేరాయి.
  • ఇందులో 600 బిలియన్‌ డాలర్లు ఫారన్‌ కస్టమర్‌ డిపాజిట్లు.
  • 379 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌తో బ్రిటన్‌ ముందు నిలిచింది.
  • 168 బిలియన్లలో అమెరికా రెండవ స్థానంలో నిలిచింది.
  • 100 బిలియన్‌ ఫ్రాంక్స్‌ పైన నిలిచిన దేశాలు ఈ రెండే
  • తరువాతి స్థానాలలో వెస్టిండీస్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, సింగపూర్‌, హాంకాంగ్‌ ఉన్నాయి.
  • స్విస్‌ బ్యాంకుల్లో అత్యధిక సంపద కలిగిన దేశాల జాబితాలో గతేదాడి భారత్‌ 51వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 44వ స్థానానికి చేరడం విశేషం.
  • రష్యా 15వ స్థానంలో, చైనా 24వ స్థానంలో ఉన్నాయి

స్విస్ బ్యాంకుల్లో విదేశీయులు దాచిపెట్టిన సొమ్ములో భార‌త వాటా కేవ‌లం 0.06 శాతం మాత్రమే.. 27 శాతం వాటాతో స్విస్ విదేశీ ఫండ్‌లో బ్రిట‌న్ మొదటి స్థానంలో ఉన్నట్లు గతేడాది స్విస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..