Airports Authority of India: టెన్త్/ఇంటర్/డిప్లొమా అర్హతతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు లక్షకుపైగా జీతం..
భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వశాఖకు చెందిన కలకత్తాలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఎలక్ట్రానిక్స్, అకౌంట్స్, ఫైర్ సర్వీస్ విభాగాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..
భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వశాఖకు చెందిన కలకత్తాలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఎలక్ట్రానిక్స్, అకౌంట్స్, ఫైర్ సర్వీస్ విభాగాల్లో 47 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్/టెలికమ్యునికేషన్/రేడియో ఇంజనీరింగ్/మెకానికల్/ఆటోమొబైల్/ ఫైర్ విభాగాల్లో కనీసం 50 శాతం మార్కులతో డిప్లొమా, ఇంటర్మీడియట్, బీకాంతోపాటు కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు లేదా ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ కోర్సు లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. హెవీ వెహికల్ లైసెన్స్, మీడియం వెహికల్ లైసెన్స్, లైట్ మోటర్ వెహికల్ లైసెన్స్ ఉండాలి.
దరఖాస్తుదారుల వయసు సెప్టెంబర్ 30, 2022వ తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 10, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ.1000లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈడబ్ల్యూఎస్/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.రాత పరీక్ష ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.31,000ల నుంచి రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.