- Telugu News Education Career Jobs Nobel Prize 2022 Winners list: Complete List of Noble Prize Winners Across Six Categories For This Year
Nobel Prize 2022 Winners: పోటీ పరీక్షల ప్రత్యేకం.. ఈ ఏడాది అన్ని రంగాల్లో నోబెల్ ఫ్రైజ్-2022లు గెల్చుకున్న విజేతలు వీళ్లే..
ప్రపంచ వ్యాప్తంగా మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్ (శాంతి) విభాగాల్లో కృషి చేసిన వారికి ప్రతి యేట డిసెంబర్ 10న నోబెల్ ఫ్రైజ్ ప్రధానం చేస్తారు. 2022వ సంవత్సరానికి గానూ అన్ని రంగాల్లో నోబెల్ బహుమతులు అందుకోబోతున్న విజేతలు వీరే..
Updated on: Oct 11, 2022 | 7:23 PM

ప్రపంచ వ్యాప్తంగా మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్ (శాంతి) విభాగాల్లో కృషి చేసిన వారికి ప్రతి యేట డిసెంబర్ 10న నోబెల్ ఫ్రైజ్ ప్రధానం చేస్తారు. నోబెల్ అవార్డు విలువ దాదాపు 10 మిలియన్ స్వీడిష్ క్రోన్స్ ($900,357). అంటే 9 లక్షల డాలర్లు (73 కోట్ల రూపాయలు). స్వీడిష్ డైనమైట్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేర ఈ బహుమతిని స్థాపించారు. నోబెల్ మరణించిన ఐదు సంవత్సరాల తర్వాత 1901 నుంచి నోబెల్ బహుమతులను అందజేయడం ప్రారంభించారు. 2022వ సంవత్సరానికి గానూ అన్ని రంగాల్లో నోబెల్ బహుమతులు అందుకోబోతున్న విజేతలు వీరే..

స్వాంటే పాబో వైద్యశాస్త్రంలో జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు ఈ బహుమతి లభించింది

ఫిజిక్స్‌లో విశేష కృషి చేసినందుకుగానూ అలేన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోన్ జైలింగర్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్-2022 వరించింది.

కెమిస్ట్రీలో విశేష పరిశోధనలు జరిపిన రోలిన్ ఆర్ బెర్టోజీ, మార్టెన్ మెల్డల్, కే బ్యారీ షార్ప్‌లెస్.. ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది.

పౌర హక్కుల కోసం కృషి చేస్తోన్న బెలారస్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్ బియాలియాత్‌స్కీతో పాటు రష్యా, ఉక్రెయిన్‌లకు చెందిన మానవ హక్కుల సంస్థలు ‘మెమోరియల్’, ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’కు ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కింది.

ఫ్రెంచ్ రచయిత్రి అన్నే ఎర్నాక్స్‌కు 2022 సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది.

బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై పరిశోధనలకుగానూ బెన్ షాలోమ్ బెర్నాంకే, డాగ్లస్ డబ్ల్యూ. డైమండ్, ఫిలిప్ హెచ్.డైబ్‌విగ్‌కు సంయుక్తంగా ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం అందజేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.
