ఫ్లాష్ న్యూస్: ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు స్వైన్ ఫ్లూ

సుప్రీం కోర్టులోని ఆరుగురు న్యాయమూర్తులకు స్వైన్‌ ఫ్లూ సోకింది. ఆరుగురు జడ్జిలు, లాయర్స్‌ స్వైన్ ఫ్లూ బారిన పడ్డారని..

  • Tv9 Telugu
  • Publish Date - 12:38 pm, Tue, 25 February 20
ఫ్లాష్ న్యూస్: ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు స్వైన్ ఫ్లూ

సుప్రీం కోర్టులోని ఆరుగురు న్యాయమూర్తులకు స్వైన్‌ ఫ్లూ సోకింది. కోర్టులోని ఆరుగురు న్యాయమూర్తులు, పలువురు లాయర్లు హెచ్1ఎన్1 వైరస్‌తో బాధపడుతున్నారని జస్టిస్ డివై చంద్రచూడ్‌ వెల్లడించారు. దీంతో.. సుప్రీంకోర్టులో పని చేసే మిగతా వారికి స్వైన్ ఫ్లూ రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్.. భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ఎస్‌ఐ బొబ్డేను కోరారు. అలాగే.. న్యాయవాదులకు టీకాలు వేసేందుకు వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలన్నారు.

అసలు H1N1 వైరస్ అంటే ఏమిటి?

‘హెచ్1ఎన్1 ఫ్లూను… స్వైన్ ఫ్లూ’ అని కూడా అంటారు. స్వైన్ ఫ్లూ అంటే పందులలో వచ్చే శ్వాసకోశ వ్యాధి. ఇది ఒక రకమైన ఇన్పఫ్లూయెన్జా వైరస్ ద్వారా పందులలో వస్తుంది. సాధారణంగా మనుషులకి స్వైన్ ఫ్లూ ఈ రకమైన వైరస్ సోకదు. అంటువ్యాధుల ద్వారా వస్తుంది. స్వైన్ ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వ్యాధి. ఆస్పత్రుల్లో ఈ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేశారు.