బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్.. ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో చేరిక..

శాసనమండలి మాజీ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత స్వామిగౌడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొంతకాలంగా టీఆర్ఎస్‌ పార్టీకి దూరంగా ఉంటున్న స్వామిగౌడ్ పార్టీ మారబోతున్నారని ప్రచారం జరిగింది.

బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్.. ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో చేరిక..
Follow us
uppula Raju

|

Updated on: Nov 25, 2020 | 7:38 PM

శాసనమండలి మాజీ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత స్వామిగౌడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొంతకాలంగా టీఆర్ఎస్‌ పార్టీకి దూరంగా ఉంటున్న స్వామిగౌడ్ పార్టీ మారబోతున్నారని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే స్వామిగౌడ్ బీజేపీలోచేరిపోయారు.

ఈ సందర్భంగా స్వామిగౌడ్ మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమ కారులకు గౌరవం దొరుకుతుందని టీఆర్ఎస్‌ పార్టీలో చేరానని కానీ అక్కడ జరిగేది వేరే విధంగా ఉందని తెలిపారు. వందసార్లు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరానని కానీ రెండేళ్లలో ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. టీఆర్ఎస్‌లో తనకు చాలా అవమానం జరిగిందని ఇప్పటికీ చాలామంది ఉద్యమకారులకు అవమానం జరుగుతుందని చెప్పుకొచ్చారు. తన సొంత గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత తనను పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధినేత నుంచి అనుమతి లేకుండా ఇలాంటివి జరగవని అన్నారు. మమ్మల్ని పక్కకు పెట్టి తెలంగాణ జెండా పట్టనివారికి కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వాపోయారు.

బీజేపీలో చేరడం అంటే తన తల్లి గారింటికి వచ్చినట్లుగా భావిస్తున్నానని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ కారుల ఆత్మాభిమానం కాపాడుకునేందుకే బీజేపీలో చేరానని అన్నారు. తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని హైదరాబాద్ మేయర్ సీట్ కచ్చితంగా గెలుస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ తనకు మాతృసంస్థలాంటిదని కితాబిచ్చారు. విద్యార్థి జీవితం నుంచే తను బీజేపీ సంస్థలతో అనుబంధం కలిగి ఉన్నానని వెల్లడించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి కారును స్వయంగా నడిపానని సంతోషం వ్యక్తం చేశారు.