AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాక్సినేషన్ పాలసీపై మళ్ళీ సుప్రీంకోర్టు ఆగ్రహం….సమగ్రంగా సమీక్షించాలని కేంద్రానికి ఆదేశం …

కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సినేషన్ పాలసీపై సుప్రీంకోర్టు మళ్ళీ విరుచుకుపడింది. ఇది లోప భూయిష్టంగా ఉందని ఇటీవలే వ్యాఖ్యానించిన కోర్టు తిరిగి ఇదే అంశాన్ని ప్రస్తావించింది. 45 ప్లస్ ఏజ్ గ్రూపువారికి ఉచిత వ్యాక్సిన్..

వ్యాక్సినేషన్ పాలసీపై మళ్ళీ సుప్రీంకోర్టు ఆగ్రహం....సమగ్రంగా సమీక్షించాలని కేంద్రానికి  ఆదేశం ...
Supreme Court
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 02, 2021 | 6:14 PM

Share

కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సినేషన్ పాలసీపై సుప్రీంకోర్టు మళ్ళీ విరుచుకుపడింది. ఇది లోప భూయిష్టంగా ఉందని ఇటీవలే వ్యాఖ్యానించిన కోర్టు తిరిగి ఇదే అంశాన్ని ప్రస్తావించింది. 45 ప్లస్ ఏజ్ గ్రూపువారికి ఉచిత వ్యాక్సిన్..ఇంతకన్నా తక్కువ వయస్సువారికి ‘పెయిడ్ సిస్టం’ ఏమిటని ఏమిటని, ఇది ప్రాథమికంగా నియంతృత్వ పోకడకు అద్దం పడుతోందని, ఏ మాత్రం సహేతుకం కాదని విమర్శించింది. ఈ పాలసీలో చాలా లోపాలు ఉన్నాయి..దీన్ని కేంద్రం సమీక్షించుకోవాలి ..ఈ ఏడాది డిసెంబరు 31 వరకు వ్యాక్సిన్లు ఎంతమేరకు అందుబాటులో ఉంటాయో రోడ్ మ్యాప్ ను సమర్పించాలి అని న్యాయమూర్తులు ఆదేశించారు. ఈ ఏడాది అంతానికల్లా దేశ జనాభాకంతటికీ టీకామందులు వేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇది సాధ్యమయ్యే పనేనా అని ప్రతిపక్షాలు, విమర్శకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం కూడా దాదాపు ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్ చాలా ముఖ్యమని, ప్రస్తుతం 18-44 ఏళ్ళ మధ్య వయస్కులు ఇన్ఫెక్షన్ కి గురి కాకపోయినా దీనివల్ల తలెత్తే ఇతర రుగ్మతల పాలబడుతున్నారని, వారికీ హాస్పిటలైజేషన్ అవసరమవుతోందని, పైగా కొన్ని సందర్భాల్లో డెత్ కూడా తప్పడంలేదని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కోవిద్ పాండమిక్ తీరు మారుతున్నందున యువత కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవలసిందేనని, భావిస్తున్నాం అని జడ్జీలు వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా 18-44 ఏళ్ళ వయస్కులకు పెయిడ్ వ్యాక్సిన్ అన్నది నిర్హేతుకం అని వారు అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఆయా పాలసీలకు న్యాయవ్యవస్థ దూరంగా ఉండాలన్న కేంద్రం వాదనను వారు తోసిపుచ్చారు. ఎగ్జిక్యూటివ్ పాలసీలు ప్రజల రాజ్యాంగ బధ్దహక్కులను హరించేవిధంగా ఉన్నప్పుడు కోర్టులు మౌన ప్రేక్షకుల్లా ఉండజాలవని వారు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : ఆకాశంలో మరో అద్భుతం ..ఈ సారి గంటకు పైగా వీక్షించే అవకాశం..: solar eclipse Viral Video

మోడీ జీ నా దగ్గర డబ్భులు లేవు..కేంద్రం తీరుపై ఝార్ఖండ్ సీఎం తీవ్ర అసంతృప్తి : Hemant Soren Fire video

విజయవాడ రైల్వే స్టేషన్ పై కరోనా ఎఫెక్ట్.. వెలవెలబోతున్న రైల్వే స్టేషన్లు :Andhra Pradesh Railway stations video