Bail to MP RRR: రఘురామకృష్ణ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట.. షరతులతో బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం

నర్సాపురం ఎంపీ రఘురామరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Bail to MP RRR: రఘురామకృష్ణ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట.. షరతులతో బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం
Sc Bail To Mp Raghu Rama Krishna Raju
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 21, 2021 | 5:44 PM

Supreme Court on MP Raghu Ramakrishna Raju: నర్సాపురం ఎంపీ రఘురామరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం .. సుప్రీంలో బెయిల్ పిటిషన్ వేయడం సబబేనని వ్యాఖ్యానించింది. రఘురామ బెయిల్‌ పిటిషన్‌పై ఇరువైపులా పోటాపోటీగా వాదనలు సాగాయి. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ప్రభుత్వం తరఫున దవే వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కొన్ని షరతులు విధిస్తూ ఈ మేరకు తీర్పు వెలువరించింది. కస్టడీలోకి తీసుకొని విచారించేటంత తీవ్రమైన ఆరోపణలు కావని, అందువల్ల రఘురామకు కస్టోడియల్‌ విచారణ అవసరం లేదని సుప్రీం పేర్కొంది. అయితే, ఆయన దర్యాప్తుకు సహకరించాలని చెప్పింది. అవసరమైప్పుడు 24 గంటల ముందుగా అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించవచ్చని సుప్రీం స్పష్టం చేసింది.

ఎంపీ రఘురామకృష్ణ రాజు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసులో కీలక అంశాలను రఘురామ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు విన్నవించారు. టార్చర్ పెట్టి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారని రఘురామ తనతో చెప్పారని ఆయన అన్నారు. చాలా సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యిందని రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిలో సెక్షన్‌ 124ఏ చాలా ముఖ్యమైందని .. బెయిల్‌ రాకూడదనే ఉద్దేశంతోనే సెక్షన్‌ 124ఏ కింద నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

మే 14న గుంటూరు పోలీస్ స్టేషన్లో ఎంపీ రఘురామరాజుపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. సీఐడీ ఏడీజీ స్వయంగా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. సీఐడీ ఏడీజీ ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి, ఆ రిపోర్ట్ ఆధారంగా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. అదే రోజు రఘురామను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

ఎంపీ రఘురామకృష్ణ రాజుకి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు..Watch Live

Read Also…. Bonus to Bank Employees: బ్యాంక్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పనితీరు ఆధారంగా బోనస్‌గా 15 రోజుల జీతం

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు