Bonus to Bank Employees: బ్యాంక్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పనితీరు ఆధారంగా బోనస్‌గా 15 రోజుల జీతం

ప్రభుత్వ బ్యాంకుల పనితీరు ఆధారంగా వారి ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నాయి. ఉద్యోగులకు బ్యాంకు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించాయి.

Bonus to Bank Employees: బ్యాంక్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పనితీరు ఆధారంగా బోనస్‌గా 15 రోజుల జీతం
Bank Employees
Follow us
Balaraju Goud

|

Updated on: May 21, 2021 | 4:58 PM

Extra Salary: ప్రభుత్వ బ్యాంకుల పనితీరు ఆధారంగా వారి ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నాయి. నవంబర్ 2020లో బ్యాంకులు ఉద్యోగుల పనితీరు అనుసంధానంలో భాగం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఉద్యోగుల్లో పనితీరు మెరుగ్గా ఉంటే అదనపు ప్రయోజనం చేకూరనుంది.

ప్రభుత్వరంగ బ్యాంకులు నవంబరు నెలలో ఉద్యోగుల పనితీరు అనుసంధాన భాగం కోసం‘ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ)’తో ఒప్పందం చేసుకున్నాయి. ఈ క్రమంలో… ఉద్యోగులకు బ్యాంకు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించాయి. ఈ వారం కెనరా బ్యాంక్ తన ఉద్యోగులకు ప్రోత్సాహకాలుగా 15 రోజుల అదనపు బోనస్ చెల్లింపును మంజూరు చేసింది. ఆర్థిక ఫలితాలను జారీ చేసిన తర్వాత బ్యాంక్ ఈ చెల్లింపు చేసింది. 2021 ఆర్థిక సంవత్సరంలో కెనరా బ్యాంకుకు నికర లాభం రూ. 2,555 కోట్లు అర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,838 కోట్ల నష్టం జరిగింది. కెనరా బ్యాంక్ ఉద్యోగులు ఉత్తమ పనితీరు కనబర్చినందుకు వారికి ఆ బ్యాంకు 15 రోజుల జీతాన్ని అదనంగా చెల్లిస్తున్నట్లు ప్రకటించింది.

కెనరా బ్యాంక్ బాటలోనే మరో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగులకు కూడా ప్రోత్సాహకాలు అందాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 165 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఈ బ్యాంకు లాభం 187 శాతం పెరిగింది. పూణే ప్రధాన కార్యాలయం తన ఉద్యోగులకు పనితీరు అనుసంధాన ప్రోత్సాహకాలను కూడా జారీ చేసింది.

ఇక, దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఉద్యోగులకు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎస్‌బీ‌ఐకి చెందిన రెండున్నర లక్షల మంది ఉద్యోగులు కూడా లాభం పొందవచ్చు. ఈ బ్యాంకు ఆర్ధిక ఫలితం కూడా సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఎస్‌బీఐ లాభం 82 శాతం పెరుగుతుందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఫలితాలు వెలువడిన వెంటనే ఎస్‌బీఐ కూడా తమ ఉద్యోగులకు బోనస్ ప్రకటించే ఛాన్స్ ఉంది.

Read Also…  SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!