SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!
State Bank Of India: మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా.? తరచూ లావాదేవీలు చేస్తుంటారా.? అయితే ఈ విషయాన్ని మీరు...
State Bank Of India: మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా.? తరచూ లావాదేవీలు చేస్తుంటారా.? అయితే ఈ విషయాన్ని మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో మీ ఖాతా నుంచి రూ. 147 డెబిట్ అయ్యాయి. అసలు ఎలాంటి ట్రాన్సక్షన్స్ చేయకుండా ఎందుకు కట్ అయ్యాయని ఆలోచించారా.? అసలు ఆ మొత్తం ఎందుకు డెబిట్ అయిందో బ్యాంక్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
డబ్బు ఎందుకు కట్ అయింది.?
ఏటీఎం లేదా డెబిట్ కార్డుల నిర్వహణ మేరకు రూ. 147 డెబిట్ అయినట్లు బ్యాంక్ స్పష్టం చేసింది. ప్రతీ సంవత్సరం ఈ డబ్బుల డిడక్షన్ ఉంటుందని వివరించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇటీవల, ఒక వ్యక్తి తన ఖాతా నుండి డబ్బు కట్ అయిందని ట్విట్టర్ వేదికగా ఎస్బీఐను ప్రశ్నించగా.. దానికి బ్యాంక్ స్పందించింది. ‘ప్రతీ వినియోగదారుడికి ఇచ్చిన ఏటీఎం కమ్ డెబిట్ కార్డు నిర్వహణలో భాగంగా ప్రతీ సంవత్సరం రూ .147.50 డెబిట్ అవుతాయని బ్యాంక్ జవాబిచ్చింది.
3 రోజులు ఆ సర్వీసులన్నీ బంద్..
మెయింటెనెన్స్ కారణంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ వెల్లడించింది. మే 21న 22.45 గంటల నుంచి మే 22న 01.15 గంటల వరకు, అలాగే మే 23న 02.40 గంటల నుంచి 06.10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఎస్‌బీఐ తెలిపింది. ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.
Also Read:
ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..
గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!