Bakrid Festival: బక్రీద్ కి ముందు ఆంక్షల సడలింపు..కేరళ ప్రభుత్వ వివరణ కోరిన సుప్రీంకోర్టు ..
బక్రీద్ కి ముందు ఆంక్షలు సడలించాలని కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై మీ అభిప్రాయం ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే కేరళలో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేసింది....
బక్రీద్ కి ముందు ఆంక్షలు సడలించాలని కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై మీ అభిప్రాయం ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే కేరళలో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేసింది. మీ స్పందన ఏమిటో ఈ రోజే తెలపాలని జస్టిస్ రోహింటన్ ఎఫ్,నారిమన్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది. మంగళవారం దీనిపై విచారణ జరగాలని సూచించింది. దేశంలో ఇప్పుడు ముఖ్యంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళలోనే కేసులు అధికంగా ఉన్నాయని పిటిషనర్ నంబియార్ తరఫున లాయర్ వికాస్ సింగ్ పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం ఆంక్షలను ఎందుకు సడలించిందన్నారు. రాష్ట్రంలో అధికారికంగా పాజిటివిటీ రేటు 10.96 శాతం ఉందని, ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం సమంజసం కాదని అన్నారు. సడలింపు ఉత్తర్వులను కోర్టు కొట్టివేయాలని ఆయన కోరారు. అయితే వీటిని సడలించినప్పటికీ కోవిడ్ ప్రొటొకాల్స్ ను కచ్చితంగా పాటించడం జరుగుతుందని ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జి. ప్రకాష్ అన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల షాపులు ఇంకా మూతబడే ఉన్నాయని ఆయన చెప్పారు.
ఈ నెల 18 నుంచి 20 వరకు ఆంక్షలను సడలిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కానీ బక్రీద్ వంటి పండుగల ముందు ఇలా వీటిని సడలిస్తే కోవిడ్ కేసులు ఇంకా పెరుగుతాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. యూపీ వంటి రాష్ట్రాల్లో ఈ కేసులు చాలా వరకు తగ్గినా మీ రాష్ట్రంలో మాత్రం ఎక్కువగా ఉన్నట్టు ఈ సంస్థ పేర్కొంది. రాష్ట్రంలో ఈ నెల 17 న ఒక్కరోజే 16 వేల 148 కేసులు నమోదయ్యాయని, ఇది ఈ నెలలో అత్యధికమని స్వయంగా సీఎం పినరయి విజయన్ వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి : Anushka Shetty Video:స్వీటీ మూవీ పై గుసగుసలు.. అనుష్క సినిమా ఆగిపోయిందా..(వీడియో).
హైదరాబాద్ లో ఆశర్యం..!బాబోయ్…సమాధి కింద శవం..! పదేళ్లయినా చెక్కుచెదరని శరీరం..:Hyderabad.
వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గ్రేట్ గుడ్ న్యూస్.. వచ్చే రెండేళ్లపాటు రిమోట్ పని..:Knowlodge Video.