Supreme Court : వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే?
దేశంలో కుక్కల దాడులు పెరగడంపై భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న వీధికుక్కల దాడులు ప్రజల్లో తీవ్ర ఆందోళనలను కలిగిస్తున్నాయని విచారం వ్యక్తం చేసింది. విదేశీయులు మన దేశాన్ని కించపరిచేలా మాట్లాడడానికి కుక్కల బెడదే కారణమని పేర్కొంది. ఈ కుక్కల బెడద దేశ ప్రతిష్టను దెబ్బతీస్తోందని చెప్పుకొచ్చింది.

వీధికుక్కల అంశంపై భారత సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల బెడద భారత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది. సోమవారం వీధికుక్కల అంశంపై సుంప్రీకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై విచారణ సంబందర్భంగా కుక్కలపై క్రూరత్వాన్ని ఒక న్యాయవాది ప్రస్తావించినప్పుడు.. మానవులపై వీధి కుక్కలు చేసే క్రూరత్వం గురించి మీరు ఏమంటారు..? అని ధర్మాసనం అతన్ని ప్రశ్నించింది. దేశంలో నమొదవుతున్న కుక్కల దాడులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. ఇలాంటి ఘటనలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయని విచారం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలే దేశాన్ని విదేశీయుల తక్కువ చేసి చూసేలా చేస్తాయని పేర్కొంది.
ఇదిలా ఉండగా సుప్రీం నియమాలను అమలుచేసే చర్యలపై అఫిడవిట్లు సమర్పించని.. రాష్ట్రాల సీఎస్‌లకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేస్తున్నట్లు జస్టిస్ విక్రమ్ నాథ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సీఎస్‌లకు కోర్టు సమన్లు జారీ చేసింది. అలాగే అఫిడవిట్లను ఎందుకు సమర్పించలేదో వివరణ కూడా ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




