AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DK Shivakumar: డీకే శివకుమార్‌కు బిగ్ రిలీఫ్.. అక్రమాస్తుల కేసు జులై 14కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

కర్ణాటక ముఖ్యమంత్రి రేసులో ఉన్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు ఊరట లభించింది. సీబీఐ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు జులై 14కు వాయిదా వేసింది.

DK Shivakumar: డీకే శివకుమార్‌కు బిగ్ రిలీఫ్.. అక్రమాస్తుల కేసు జులై 14కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
Dk Shivakumar
Sanjay Kasula
|

Updated on: May 17, 2023 | 2:07 PM

Share

ఓవైపు కర్నాటక సీఎం పదవి దక్కలేదన్న బాధలో ఉన్న డీకే శివకుమార్‌కు షాకిచ్చిందుకు సీబీఐ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్రమాస్తుల కేసులో డీకే శివకుమార్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలన్న సీబీఐ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు జులై 14కు వాయిదా వేసింది. డీకే శివకుమార్‌ సీబీఐ విచారణపై కర్నాటక హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను సవల్‌ చేస్తూ సీబీఐ ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఈ వ్యవహారం కర్నాటక హైకోర్టులో విచారణకు రానుందని డీకే శివకుమార్‌ తరపు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్నాసనం విచారణను జులై 14కు వాయిదా వేసింది.

డీకే శివకుమార్‌పై సీబీఐ దర్యాప్తుపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. స్టే ఆర్డర్‌ను తొలగించాలని సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు సెలవులు ముగియనున్నందున అక్కడే విచారించడం సముచితమని అభిప్రాయపడింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలకు సంబంధించి డీకే శివకుమార్‌పై సీబీఐ దర్యాప్తును హైకోర్టు నిలిపివేసింది. ఆపై మే నెలాఖరు వరకు పొడిగించారు.

74.93 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా సంపాదించారని డీకే శివకుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీని ప్రకారం 2020 అక్టోబర్ 5న ఢిల్లీ, ముంబై సహా డీకే శివకుమార్‌కు చెందిన 14 స్థలాలపై సీబీఐ ఏకకాలంలో దాడులు చేసింది. ఈ కేసులో కంప్యూటర్ హార్డ్ డిస్క్ మరియు 57 లక్షలు రూ. నగదుతోపాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం