PM Narendara Modi: మీరే పేర్లు చెప్పండి.. ‘పద్మ’ పురస్కారాలకు నామినేట్ చేయండి.. ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

Padma Awards: పద్మ పురస్కారాల కోసం పేర్లు సూచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. క్షేత్ర స్థాయిలో అసాధారణ కార్యక్రమాలు చేస్తూ...

PM Narendara Modi: మీరే పేర్లు చెప్పండి.. ‘పద్మ’ పురస్కారాలకు నామినేట్ చేయండి.. ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
Pm Narendra Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 11, 2021 | 2:15 PM

Padma Awards: పద్మ పురస్కారాల కోసం పేర్లు సూచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. క్షేత్ర స్థాయిలో అసాధారణ కార్యక్రమాలు చేస్తూ.. ప్రజలకు, దేశానికి సేవలందిస్తున్న వారిని ‘పద్మ’ పురస్కారాల కోసం నామినేట్ చేాయాలని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదిక ద్వారా కోరారు. విశిష్ట సేవలందించిన వారిని గౌరవించేందుకు ప్రదానం చేసే ఈ పురస్కారాలు.. ఎవరికి దక్కితే బాగుంటుందనేది ఆలోచించాలని.. అలాంటి వారిని నామినేట్ చేయాలని ప్రజలందరినీ కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఈ  విధంగా ట్విట్ చేశారు.

‘భారతదేశంలో క్షేత్ర స్థాయిలో అసాధారణ కృషి చేసే అనేక మంది ప్రతిభావంతులు ఉన్నారు. అలాంటి వారి గురించి మనకు అంతగా తెలియదు, మనం గమనించం. అయితే.. ప్రేరణనిచ్చే వ్యక్తుల గురించి మీకు తెలుసా? అయితే.. మీరు వారిని #PeoplesPadmaకు నామినేట్ చేయొచ్చు. సెప్టెంబరు 15 వరకు నామినేషన్లు పంపండి’ అంటూ మోదీ ట్విట్ చేశారు.

‘పద్మ’ పురస్కారాలను 1954 నుంచి ప్రభుత్వం ప్రదానం చేస్తోంది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాల సందర్భంగా వీటిని ప్రకటిస్తుంది. సమాజనికి విశిష్ట సేవలందించినవారికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పౌర పురస్కారాలను ప్రభుత్వం ప్రదానం చేస్తుంది.

Also Read:

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల చిహ్నం ‘దొంగ’ అయితే బెటర్..విపక్ష నేత మరియం నవాజ్ ధ్వజం

Kuntala Waterfalls: డేంజర్ జోన్ లో గేమ్స్ వద్దు.. తస్మాత్ జాగ్రత్త.. పట్టు తప్పిందో ప్రాణాలు గోవిందా..!