Viral: ఇదేం చిత్రం గురూ.. ఆకాశం నుంచి ఈ సైజ్ రాళ్లు పడ్డాయ్…
బీడ్ జిల్లాలోని వాద్వానీ తాలూకాలోని లిమ్‌గావ్‌లో అకస్మాత్తుగా ఆకాశం నుండి రాళ్లు పడిన దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. ఈ సంఘటన గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. భూగర్భ శాస్త్రవేత్తలు ఆ స్థలాన్ని పరిశీలించారు. అయితే, రాళ్లు పడటానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

నేర సంఘటనలతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన మహారాష్ట్రలోని బీడ్‌లో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. వడ్డాని తాలూకాలోని లిమ్‌గావ్‌లో అకస్మాత్తుగా ఆకాశం నుండి రాళ్లు పడ్డాయి. పెద్ద శబ్ధాలతో రాళ్లు పడటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానిక అధికార యంత్రాంగం ఈ రాళ్లను స్వాధీనం చేసుకుంది. ఛత్రపతి శంభాజీ నగర్ ఎంజిఎం విశ్వవిద్యాలయానికి చెందిన నుంచి వచ్చిన భూగర్భ శాస్త్రవేత్తలు కూడా ఆ ప్రదేశాన్ని సందర్శించి పరిశీలించారు. అయితే, అకస్మాత్తుగా ఆకాశం నుండి రాళ్లు పడటంతో.. ఏమనా కీడు జరుగుతుందేమో అని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
వడవాని తాలూకాలోని సందడిగా ఉండే లిమ్‌గావ్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మూడు పెద్ద శబ్దాలు వినిపించాయి. ఏంటా అని వెళ్లి చూడగా పై నుంచి పడ్డ రాళ్లు కనిపించాయి. ఈ రాళ్లలో ఒకటి భికాజీ అంబురే ఇంటిపై పడింది. రాయి పడిన వేగానికి అతని ఇంటి పైకప్పు విరిగిపోయింది. మరో రెండు రాళ్లు పక్కన పొలాల్లో పడ్డాయని గ్రామస్తులు తెలిపారు.
సంఘటనా స్థలానికి పరిశోధకులు
బుధవారం ఉదయం, ఛత్రపతి శంభాజీ నగర్‌లోని ఎపిజె అబ్దుల్ కలాం ఖగోళ శాస్త్రం, అంతరిక్ష శాస్త్ర కేంద్రంకు చెందిన పరిశోధకులు శ్రీనివాస్ ఔంధ్కర్ అభినవ్ విటేకర్ ఆ ప్రదేశాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ శబ్దం దేని వల్ల వచ్చింది? రాళ్లు ఎక్కడి నుంచి పడ్డాయి..? దీని వెనక కారణమేమిటి? అన్న విషయాలపై విళ్లేషణ జరుపుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




