AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMO, పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటు చేయబోతున్న వేద గడియారం.. దీని ప్రత్యేకమేంటంటే

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఆధునిక వేద గడియారాలు తయారవుతున్నాయి. ఇవి హిందీ, ఇంగ్లీషులో మాత్రమే కాకుండా 189 భాషలలో సమయాన్ని తెలియజేస్తాయి. ప్రస్తుతం, విక్రమాదిత్య పరిశోధన కేంద్రంలో ఒక వేద గడియారం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యాప్ కూడా లాంచ్ కానుంది. ప్రారంభంలో, ఈ గడియారాన్ని ప్రధానమంత్రి కార్యాలయం, కొత్త పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేస్తారు.

PMO,  పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటు చేయబోతున్న వేద గడియారం.. దీని ప్రత్యేకమేంటంటే
Vikramaditya Vedic Clock
Balaraju Goud
|

Updated on: Mar 05, 2025 | 1:45 PM

Share

గత సంవత్సరం ఫిబ్రవరి 29న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విక్రమాదిత్య వేద గడియారాన్ని ప్రారంభించారు. విక్రమాదిత్య వేద గడియారం ప్రపంచంలోనే మొట్టమొదటి గడియారం. ఇది భారతీయ సమయ గణనపై ఆధారపడి ఉంటుంది. ఈ గడియారం ప్రారంభించిన ఒక సంవత్సరం తర్వాత, 2025 మార్చి 30న విక్రమాదిత్య వేద గడియారం యాప్ ప్రారంభించడం జరుగుతోంది. దీంతో పాటు, 100 కంటే ఎక్కువ చిన్న వెర్షన్ల వేద గడియారాలు కూడా తయారు చేయడం జరిగింది. వీటిని దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ముఖ్యమైన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని ఫ్లాన్ చేస్తున్నారు. ఇది మన దేశ ప్రతిష్టను పెంచుతుందని భావిస్తున్నారు.

ఈ వేద గడియారాలను ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తున్నామని విక్రమాదిత్య పరిశోధనా కేంద్రం డైరెక్టర్ శ్రీరామ్ తివారీ తెలిపారు. ఇందులో హిందీ, ఇంగ్లీషుతో పాటు దాదాపు 189 భాషలు ఉంటాయని అన్నారు. ఈ గడియారం ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకుంటే, కరెంటు పోయినా ఈ గడియారం ఆగకుండా, దాని సమయం స్వయంచాలకంగా నడుస్తూ ఉండేలా ప్రత్యేక చిప్‌ని ఉపయోగించి దీనిని తయారు చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం, భోపాల్‌లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈ వేద గడియారం కొత్త వెర్షన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహూకరించారు. దీనిని ప్రధానమంత్రి కూడా ప్రశంసించారు. ప్రస్తుతం, ఇటువంటి వేద గడియారాలు విక్రమాదిత్య శోధపీఠ్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కానీ త్వరలో ఇటువంటి 100 కు పైగా వేద గడియారాలు దేశ విదేశాలకు పంపించడం జరుగుతుంది. మొదటగా దీనిని ప్రధానమంత్రి కార్యాలయం, కొత్త పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

విక్రమాదిత్య వేద గడియారం యాప్‌ను సిద్ధం చేసినట్లు విక్రమ్ విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్రవేత్త రామన్ సోలంకి తెలిపారు. ఈ యాప్ GPS ద్వారా ఆధారితమైనది. ఇది ఏ ప్రదేశంలోనైనా సూర్యోదయ సమయాన్ని ఖచ్చితంగా గుర్తించడంలో సహాయపడుతుంది. తదనుగుణంగా వేద సమయాన్ని లెక్కిస్తుంది. ఈ యాప్‌ను 189 కంటే ఎక్కువ భారతీయ మరియు ప్రపంచ భాషలలో చూడవచ్చు.

ఈ గడియారం సూర్యోదయం నుండి చెల్లుతుంది. ఏ ప్రదేశంలో సూర్యోదయం అయ్యే సమయం ఏదైనా. అది ఆ స్థలం సమయ గణన ప్రకారం ఉంటుంది. ప్రామాణిక సమయం కూడా దానికి లింక్ చేయడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా, వేద సమయం, స్థానం, భారత ప్రామాణిక సమయం, గ్రీన్విచ్ సగటు సమయం, ఉష్ణోగ్రత, గాలి వేగం, తేమ, భారతీయ క్యాలెండర్, విక్రమ్ సంవత్, నెల, గ్రహ స్థానం, యోగా, భద్ర స్థానం, చంద్ర స్థానం, పండుగ, శుభ, అశుభ సమయం, ఘటి, నక్షత్రం, జయంతి, ఉపవాసం, పండుగ, చౌఘడియ, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఆకాశం స్థానం, గ్రహాలు, నక్షత్రరాశులు, గ్రహాల భ్రమణం మొదలైన వాటి గురించి సమాచారం ఈ వేద గడియారంలో ఇమిడి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..