Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Customer Alart: మీ ఫోన్‌లో ఆ డేటా ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి… లేకపోతే సమస్యల్లో చిక్కుకున్నట్లే: ఎస్‌బీఐ

SBI Customer Alart: దేశంలో అనేకమైన ఆన్‌లైన్‌ మోసాలు జరుగుతున్నాయి. మోసాలు జరుగకుండా ఉండేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా.. మోసాలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. డిజిటల్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాలు...

SBI Customer Alart: మీ ఫోన్‌లో ఆ డేటా ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి... లేకపోతే సమస్యల్లో చిక్కుకున్నట్లే: ఎస్‌బీఐ
SBI FD Interest Rates
Follow us
Subhash Goud

|

Updated on: Apr 19, 2021 | 11:02 PM

SBI Customer Alart: దేశంలో అనేకమైన ఆన్‌లైన్‌ మోసాలు జరుగుతున్నాయి. మోసాలు జరుగకుండా ఉండేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా.. మోసాలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. డిజిటల్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాలు గణనీయంగా మెరుగుడినప్పటికీ, కొత్త రకంగా మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. అమాయకులను ఆసరా చేసుకుని నిలువునా మోసగిస్తున్నారు. ప్రజలు తమ మొబైల్‌ నుంచి వేర్వేరు యాప్‌ల ద్వారా బ్యాంకింగ్‌ సేవలు పొందుతున్న నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ తరుణంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా అనేక బ్యాంకులు తమ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు డిజిటల్‌ మోసాలపై హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి. తాజాగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్లను మరోసారి అప్రమత్తం చేసింది.

బ్యాంకు ఖాతాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని స్మార్ట్‌ ఫోన్‌లలో ఉంచవద్దని సూచించింది. బ్యాంకింగ్‌ మోసాలు పెరిగిపోతుండటంతో స్మార్ట్‌ఫోన్లలో బ్యాంకింగ్ పిన్‌, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల సమాచారం, వాటి పాస్‌వార్డ్‌లు, సీవీవీ నంబర్‌ సహా కీలక సమాచారాన్ని దాచి ఉంచితే సైబర్‌ నేరగాళ్ల బారిన పడినట్లేనని హెచ్చరించింది. అందుకే బ్యాంకింగ్‌ సంబంధిత కీలక సమాచారాన్ని తక్షణమే ఫోన్‌లో నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసింది. లేకపోతే సమస్యల్లో చిక్కుకోవడం ఖాయమని హెచ్చరించింది. అంతేకాకుండా మొబైల్‌ ఫోన్‌లలోనే కాకుండా కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ల నుంచి కూడా డేటాను తొలగించాలని సూచించింది. ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్న దృష్ట్యా కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది ఎస్‌బీఐ.

కాగా, ఇప్పటికే బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం డిజిటల్‌ రంగంలో బ్యాంక్‌ లావాదేవీలు, బ్యాంకులకు సంబంధించి ఇతర పనులు ఎక్కువ మంది మొబైల్‌లో ఆన్‌లైన్‌ ద్వారానే చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని ఆసరా చేసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు నిలువునా దోచేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠాలనే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి నిఘానే పెట్టారు.

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఉదయం నిలకడగా ఉన్నా… సాయంత్రం ఎగబాకింది.. వెండి కూడా అదే బాటలో..

RBI Auction: ఆర్బీఐ కీలక నిర్ణయం… రూ. 14వేల కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీ వేలం రద్దు… అధిక ధరలకు అమ్మాలని ట్రేడర్ల డిమాండ్‌