పాక్‌లో ఆ గ్రేనేడ్‌ ఎటాక్‌ చేసింది మేమే.. సింధూదేశ్‌ రెవల్యూషన్ ఆర్మీ

పాకిస్థాన్‌లో సోమవారం గ్రేనేడ్ ఎటాక్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. పాక్‌లోని శిఖర్పూర్, జకోబాబాద్‌లోని పాకిస్థాన్‌ రేంజర్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌పై గ్రేనేడ్‌ ఎటాక్‌లో ఐదుగురు మృతి చెందగా.. మరో పది మంది..

పాక్‌లో ఆ గ్రేనేడ్‌ ఎటాక్‌ చేసింది మేమే.. సింధూదేశ్‌ రెవల్యూషన్ ఆర్మీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 11, 2020 | 5:47 PM

పాకిస్థాన్‌లో సోమవారం గ్రేనేడ్ ఎటాక్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. పాక్‌లోని శిఖర్పూర్, జకోబాబాద్‌లోని పాకిస్థాన్‌ రేంజర్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌పై గ్రేనేడ్‌ ఎటాక్‌లో ఐదుగురు మృతి చెందగా.. మరో పది మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు తొలుత తెలియరాలేదు. ఆ తర్వాత సింద్‌ రెవల్యూషన్ ఆర్మీ.. ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. గత నెలలో కూడా సింధూదేశ్‌ రెవల్యూషన్ ఆర్మీ.. ఇలాంటి దాడులకు పాల్పడింది. పాక్ రేంజర్లపై గ్రేనేడ్ ఎటాక్ చేసింది. ఆ ఘటనలో కూడా పలువురు పాక్‌ రేంజర్లు గాయపడ్డారు. సింధ్ ప్రాంతంపై పాక్‌ పెత్తనం మానుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఈ ఘటనకు పాల్పడ్డారు సింధూదేశ్‌ రెవల్యూషన్ ఆర్మీ. సింధ్ ప్రాంతంపై పాక్‌ ప్రభుత్వం పెత్తనం సహించేది లేదని.. తమకు పాక్‌ ప్రభుత్వం నుంచి విముక్తి కలిగే వరకు పాక్‌పై పోరాటం కొనసాగుతుందని సింధూదేశ్‌ రెవల్యూషన్ ఆర్మీ ప్రకటించింది.